Thursday, May 2, 2024

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నిర‌వ‌ధిక వాయిదా

spot_img

తెలంగాణ అసెంబ్లీ స‌మావేశాలు నిర‌వ‌ధిక వాయిదా ప‌డ్డాయి. ఈ నెల 9వ తేదీన అసెంబ్లీ ప్రారంభ‌మైంది. మొత్తం ఆరు రోజుల పాటు శాస‌న‌స‌భ స‌మావేశాలు కొన‌సాగాయి. ఈ ఆరు రోజుల్లో 26 గంట‌ల 33 నిమిషాల పాటు స‌మావేశాలు కొనసాగిన‌ట్లు స్పీక‌ర్ గ‌డ్డం ప్ర‌సాద్ కుమార్ తెలిపారు. 19 మంది ఎమ్మెల్యేలు ప్ర‌సంగించారు. ఈ స‌భ‌లో రెండు అంశాల‌పై స్వ‌ల్ప‌కాలిక చ‌ర్చ‌లు జ‌రిగాయి. డిసెంబ‌ర్ 21వ తేదీన నాటికి స‌భ‌లో కాంగ్రెస్‌కు 64, బీఆర్ఎస్‌కు 39, బీజేపీకి 8, ఎంఐఎం 7, సీపీఐ త‌ర‌పున ఒక ఎమ్మెల్యే ఉన్న‌ట్లు స్పీక‌ర్ ప్ర‌క‌టించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత నిర్వ‌హించిన తొలి శాస‌న‌స‌భ స‌మావేశం ఇది.

Read also: ఫూంచ్ లో ఉగ్ర‌దాడి.. ముగ్గురు జ‌వాన్లు మృతి

Latest News

More Articles