Thursday, May 2, 2024

గ్రామ పంచాయతీలకు మిషన్ భగీరథ నీటి సరఫరా పనులు

spot_img

రాష్ట్ర ప్రభుత్వం గ్రామాల్లో నీటి సరఫరా వ్యవస్థ నిర్వహణను గ్రామ పంచాయతీల పరిధిలోకి తెచ్చింది. ఓవర్‌హెడ్ సర్వీస్ రిజర్వాయర్ (ఓహెచ్‌ఎస్‌ఆర్) నుండి ఇంటి కనెక్షన్ వరకు ఇంట్రా-విలేజ్ నీటి సరఫరా వ్యవస్థను నిర్వహించాలని గ్రామ పంచాయతీలను ఆదేశిస్తూ జిఓ జారీ చేసింది.

ఓహెచ్‌ఎస్‌ఆర్‌ల క్లోరినేషన్‌, క్లీనింగ్‌, కొత్త కుళాయి కనెక్షన్ల జారీ, పైప్‌లైన్ల మరమ్మతులు వంటి కార్యక్రమాలను కూడా ప్రభుత్వం గ్రామ పంచాయతీలకు అప్పగించింది. గ్రామ పంచాయతీల ద్వారా చేపట్టే నిర్వహణ పనులకు సంబంధించిన అంచనాలను మండల ఇంట్రా-విలేజ్ ఏఈఈ, మిషన్ భగీరథకు చెందిన ఏఈలు తయారు చేయాలనీ ఆదేశించింది ప్రభుత్వం. పంచాయతీలు ఇంట్రా-విలేజ్ ఏఈఈలు లేదా ఏఈల పర్యవేక్షణలో కూడా వాటిని అమలు చేయాలనీ చెప్పారు అధికారులు.

Latest News

More Articles