Friday, May 10, 2024

డెలివరీల్లో రికార్డ్ నెలకొల్పిన తెలంగాణ ప్రభుత్వ ఆస్పత్రులు

spot_img

డెలివరీల్లో తెలంగాణ ప్రభుత్వ ఆసుపత్రులు రికార్డ్ నెలకొల్పుతున్నాయి. జూలై నెలలో అత్యధికంగా 72 శాతం డెలివరీలు నమోదు అయ్యాయి. తెలంగాణ ఏర్పాటుకు ముందు ప్రభుత్వ ఆసుపత్రులలో 30 శాతంగా ఉన్న డెలివరీలు.. ఇప్పుడు 72 శాతానికి పెరిగాయి.

ప్రభుత్వ ఆస్పత్రులలో కల్పించిన వసతులతో డెలివరీలు బాగా పెరిగాయని ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు. సీఎం కేసీఆర్ మార్గనిర్దేశంలో ప్రభుత్వ ఆసుపత్రులపై ప్రజలకు పెరిగిన నమ్మకానికి ఇది ఒక నిదర్శనం అని మంత్రి వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ వైద్యారోగ్య సిబ్బందికి మంత్రి హరీశ్ రావు అభినందనలు తెలిపారు.

Latest News

More Articles