Thursday, May 2, 2024

‘చిరు’ రెమ్యునరేషన్‌ వార్తలపై ‘భోళా’ నిర్మాతలు క్లారిటీ

spot_img

హైదరాబాద్: ‘భోళా శంకర్‌’ ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయినా, తన రెమ్యునరేషన్‌ విషయంలో చిరంజీవి వెనక్కి తగ్గడం లేదని వార్తలు వచ్చాయి. ఒకపక్క సినిమా పరాజయం పాలై నిర్మాణ సంస్థ ఇబ్బందులు పడుతుంటే చిరు రెమ్యునరేషన్ విషయంలో వెనక్కి తగ్గడం లేదని వాట్సాప్ పుకార్లు హల్చల్ చేస్తున్నాయి.

చిరు రెమ్యునరేషన్ చెల్లించేందుకు చిత్ర నిర్మాత అనిల్‌ సుంకర ఇల్లు, తోట తాకట్టు పెట్టారని అని వైరల్ అవుతున్న వార్తల్లో ఉన్నాయి. అయితే, చిరు భోళా పారితోషికంపై వస్తున్న వార్తలపై  నిర్మాణసంస్థ స్పందించింది. ‘‘ చిరు రెమ్యునరేషన్‌ వివాదంపై వస్తున్న వార్తలలో నిజం లేదు. వాటిల్లో ఒక్కశాతం కూడా వాస్తవం లేదు. అలాంటి వార్తలను దయచేసి ఎవరూ నమ్మొద్దు’’ అని నిర్మాణ సంస్థ ట్వీట్‌ చేసింది.

Latest News

More Articles