Monday, May 6, 2024

వృద్ధులపై వలపు వల! న్యూడ్ వీడియో కాల్స్ చేసి రికార్డ్ చేసి రూ. 23 లక్షలు లూటీ

spot_img

న్యూడ్ వీడియో కాల్స్ రికార్డ్ చేసి డబ్బులు గుంజడం నిత్యకృత్యమైంది. తాజాగా అటువంటి ఘటన హైదరాబాద్‎లో జరిగింది. వృద్ధులతో పరిచయం పెంచుకున్న కీలేడీలు.. వారి న్యూడ్ వీడియో కాల్స్ రికార్డ్ చేసి లక్షలు కొట్టేశారు. ముందుగా వృద్ధులతో వాట్సాప్ చాటింగ్ చేయడం, చనువు పెంచుకోవడం వారి పని. ఆ తర్వాత వీడియో కాల్స్ చేయడం, మెల్లగా ముగ్గులోకి దించడం. అనంతరం న్యూడ్ వీడియో కాల్స్ చేసి, వారితో మాట్లాడుతూ వీడియో రికార్డ్ చేస్తారు. ఆ తర్వాత ఆ వీడియో కాల్స్ ను చూపించి, బెదిరింపులకు దిగుతారు. ఈ విధంగా హైదరాబాద్ లోని ఇద్దరు వృద్ధులకు వలపు వల వేసి, వారి నుంచి ఏకంగా 23 లక్షలు కాజేశారు. దాంతో బాధితులు సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు.

Latest News

More Articles