Wednesday, May 8, 2024

సాయిపల్లవి ఇంట్లో పెండ్లి వేడుకలు షురూ..!!

spot_img

నటి సాయిపల్లవి ఇంట్లో పెండ్లి వేడుకలు షురూ అయ్యాయి.ఆమె చెల్లెలు పూజా కన్నన్ త్వరలోనే పెండ్లీ పీటలు ఎక్కనుంది. పెద్దలను ఒప్పంచి తన ప్రియుడితో మూడు ముళ్లు వేయించుకునేందుకు రెడీ అయ్యింది. ఈ క్రమంలోని నిశ్చితార్థం కూడా జరిగింది. ఈ విషయాన్ని ఇన్ స్టాగ్రామ్ లో పూజ కన్నన్ పోస్టు చేసింది. నిశ్చితార్థం సెలబ్రేషన్స్ మొదలయ్యాయని చెబుతూ కొన్ని ఫొటోలను కూడా షేర్ చేసింది. రెండు చేతులకు మెహందీ పెట్టుకుని పూజా కన్నన్ సంతోషంతో కనిపించింది. తన అక్క సాయిపల్లవితో ఎంజాయ్ చేస్తున్న ఫొటోలను షేర్ చేసింది.

 

View this post on Instagram

 

A post shared by Pooja Kannan (@poojakannan_97)

చాలా ఏళ్లుగా ప్రేమలో ఉన్న పూజా కన్నర్…సంక్రాంతి సమయంలో తన బాయ్ ఫ్రెండ్ వినీత్ ను ఇన్ స్టా వేదికగా పరిచయం చేసింది. తమ పెళ్లికి పెద్దలు అంగీకరించారని త్వరలోనే తమ పెళ్లి జరుగుతున్నట్లు హింట్ ఇచ్చింది.

 

View this post on Instagram

 

A post shared by Sai Pallavi (@saipallavi.senthamarai)

ఇది కూడా చదవండి: ఈరోజు ఉదయం 10గంటల టీటీడీ కల్యాణోత్సవ టికెట్లు జారీ..!! 

Latest News

More Articles