Saturday, May 4, 2024

ఓటీటీలోకి ‘ఫ్యామిలీ స్టార్‌’..స్ట్రీమింగ్ ఎప్పుడంటే.?

spot_img

టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ నటించిన మూవీ ఫ్యామిలీ స్టార్. ఈ మూవీ గీతా గోవిందం ఫేమ్ పరశురామ్ డైరెక్షన్ లో శ్రీవెంటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు, శిరీష్ నిర్మించారు. ఈ మూవీ ఏప్రిల్ 5న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కథ రోటిన్ గా ఉండటం,కొత్తదనం లేకపోవడంతో బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో ఫలితాన్ని అందుకోలేకపోయిది. అయితే తాజాగా ఈ మూవీ ఓటీటీ లాక్ చేసుకుంది.

ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ ఫాం అమెజాన్ ప్రైమ్ లో ఈ మూవీ ఏప్రిల్ 25న తెలుగు, తమిళ భాషల్లో స్టీమింగ్ కానుంది. ఈ విషయాన్ని చిత్ర బృందం సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది.

ఇది కూడా చదవండి:నేటితో ముగియనున్న నామినేషన్ల గడువు..!

Latest News

More Articles