Sunday, May 5, 2024

సూడాన్‌లో ఆకలితో 500 మంది చిన్నారులు మృతి..!

spot_img

సూడాన్‌లో అంతర్యుద్ధం ప్రారంభమైన ఏప్రిల్‌ నుంచి ఇప్పటివరకు దాదాపు 500 మంది చిన్నారులు ఆకలితో మరణించారు. ఈ మేరకు స్థానికంగా పనిచేసే సేవ్‌ ది చిల్డ్రన్‌ అనే స్వచ్ఛంద సంస్థ వెల్లడించింది. అంతేకాకుండా 31వేల మంది పోషకాహార లోపంతో బాధపడుతున్నారని ఆందోళన వ్యక్తం చేసింది. మరోవైపు ఘర్షణల కారణంగా అనేక మందికి నీరు, విద్యుత్‌ సౌకర్యాల లేమితో బాధపడుతున్నట్లు సేవ్‌ ది చిల్డ్రన్‌ సూడాన్‌ డైరెక్టర్‌ ఆరీఫ్‌ నూరీ పేర్కొన్నారు.

సూడాన్‌లో పారామిలిటరీ ర్యాపిడ్‌ సపోర్ట్‌ ఫోర్స్‌ను సైన్యంలో విలీనం చేసే ప్రతిపాదన.. ఆర్మీ- పారామిలిటరీ బలగాల మధ్య ఘర్షణలకు దారితీసిన విషయం తెలిసిందే. ఏప్రిల్ 15న మొదలైన ఈ అంతర్యుద్ధంలో ఇప్పటివరకు దాదాపు 4వేల మంది మృతి చెందినట్లు యూఎన్ఓ తెలిపింది. దాదాపు 44లక్షల మంది సురక్షిత ప్రాంతాలు లేదా పొరుగు దేశాలకు తరలివెళ్లిపోయినట్లు పేర్కొంది.

Latest News

More Articles