Wednesday, May 8, 2024

89 ఏళ్ల వ్యక్తి విడాకుల కేసులో సుప్రీంకోర్టు కీలక తీర్పు

spot_img

న్యూఢిల్లీ: తన భార్య నుంచి విడాకులు కావాలని కోరిన 89 ఏళ్ల వ్యక్తి కేసు విషయంలో సుప్రీంకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. ఈ వయసులో వివాహాన్ని రద్దు చేస్తే  సదరు వ్యక్తి భార్యకు అన్యాయం జరుగుతుందని తీర్పులో కోర్టు పేర్కొంది. వీరి విడాకుల కేసు దాదాపుగా 27 సంవత్సరాల పాటు కొనసాగడం గమనార్హం.

Also Read.. నేను కేసీఆర్ కుమార్తెగా గర్వపడుతున్నాను

వివరాల్లోకి వెళితే.. ఇండియన్ ఎయిర్‌ఫోర్సులో పనిచేసిన నిర్మల్ సింగ్ పనేసర్(89)కు 1963లో వివాహం జరిగింది. 1984లో చెన్నైకి ట్రాన్స్‌పర్ అయింది. అయితే, ఆయన భార్య పరంజిత్ కౌర్ పనేసర్(86) చెన్నై వెళ్లేందుకు నిరాకరించింది. ఆ తర్వాత వారిద్దరి మధ్య విభేదాలు తలెత్తాయి.

Also Read.. పాస్ఫరస్‌ బాంబులు ప్రయోగిస్తున్న ఇజ్రాయెల్‌!

1996లో భార్యతో విడాకులు ఇప్పించాలని కోర్టును ఆశ్రయించాడు. 2000లో జిల్లా కోర్లు విడాకులు మంజూరు చేసింది. కాగా, భార్య పరంజిత్ కౌర్ తీర్పును పై న్యాయస్థానాల్లో సవాల్ చేసింది. ఈ కేసులు సుప్రీం ముందుకు చేరేందుకు మరో రెండు దశాబ్ధాలు పట్టింది. తాజాగా సుప్రీంకోర్టు వీరిద్దరికి విడాకులు ఇవ్వడానికి నిరాకరించింది.

Also Read.. నేషనల్ మీడియాలో అన్నామలై ఓవర్ యాక్షన్.. కవిత దిమ్మతిరిగే సమాధానం..!

అంతకుముందు విడాకులు తీసుకుందనే కళంకంతో తాను చనిపోవాలని కోరుకోవడం పరంజీత్ కౌర్ కోర్టుకు తెలిపింది. తాను ఈ పవిత్రబంధాన్ని గౌరవించడానికి అన్ని ప్రయత్నాలు చేశానని పేర్కొంది. వృద్ధాప్యంలో తన భర్తను చూసుకోవడానికి సిద్ధంగా ఉన్నట్లు ఆమె కోర్టుకు చెప్పింది. ఈ దంపతులకు ముగ్గురు పిల్లలు ఉన్నారు.

Latest News

More Articles