Thursday, May 9, 2024

జర భద్రం.. రాష్ట్రానికి ఎల్లో అలెర్ట్‌ జారీ

spot_img

తెలంగాణలో రాగల ఐదురోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. ఉరుములు, మెరుపులతో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. గురువారం నుంచి అక్టోబర్‌ 2వ తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల ఉరుములు, మెరుపులతో వర్షాలు కురుస్తాయని వెల్లడించింది.

ఈ మేరకు ఎల్లో అలెర్ట్‌ను జారీ చేసింది. ఇక హైదరాబాద్‌లో ఆకాశం మేఘావతృమై ఉంటుందని, నగరంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఉదయం వేళల్లో పొగమంచు వాతావరణం నెలకొనే అవకాశం ఉందని పేర్కొంది. ఇదిలా ఉండగా.. నిర్మల్‌, కామారెడ్డి, భద్రాద్రి కొత్తగూడెం, రంగారెడ్డి, సిద్దిపేట తదితర జిల్లాల్లో వర్షం కురిసింది. అత్యధికంగా కామారెడ్డి జిల్లా తడ్వాల్‌లో 11.8 సెంటీమీటర్ల వర్షాపాతం నమోదైందని టీఎస్‌డీపీఎస్‌ తెలిపింది.

Latest News

More Articles