Thursday, May 9, 2024

కదులుతున్న ఓటకు నోటు కేసు.. వణుకుతున్న టీడీపీ, కాంగ్రెస్

spot_img

ఓటకు నోటు కేసులో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు ఫిబ్రవరిలో విచారించనుంది. హైకోర్టు ఆదేశాలను సవాల్ చేస్తూ రేవంత్ రెడ్డి ఓ పిటిషన్ వేశారు. రేవంత్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌తోపాటు మరికొన్ని పిటిషన్లు తాజాగా సుప్రీంకోర్టు ధర్మాసనం ముందుకు వచ్చింది. ఈ పిటిషన్లను న్యాయమూర్తులు సంజీవ్ ఖన్నా, దీపాంకర్ దత్తాల ధర్మాసనం విచారిస్తుండగా.. అందులో ఒక న్యాయవాది కుటుంబంలో విషాదం నెలకొందనే విషయం తెలిసింది. దీంతో ఆ పిటిషన్ల విచారణను ఫిబ్రవరి నెలకు వాయిదా వేశారు.

అయితే ఈ కేసులో దర్యాప్తు చేసే జ్యూరిస్‌డిక్షన్ ఏసీబీకి లేదని రేవంత్ రెడ్డి వాదించారు. ఇదే వాదనతో హైకోర్టులో పిటిషన్ వేశారు. హైకోర్టు రేవంత్ రెడ్డి పిటిషన్‌ను కొట్టివేసింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తాజాగా, ఆయన పిటిషన్ విచారణకు వచ్చింది. ఫిబ్రవరిలో సుప్రీంకోర్టు విచారించనుంది. దీంతో కాంగ్రెస్ వర్గాలతోపాటు టీడీపీ శ్రేణుల్లోనూ ఆసక్తి నెలకొంది. ఎందుకంటే త్వరలోనే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.

Latest News

More Articles