Tuesday, April 30, 2024

తమిళనాడులో బీజేపీకి భారీ షాక్.. న‌టి గౌత‌మి రాజీనామా

spot_img

న్యూఢిల్లీ : భార‌తీయ జ‌న‌తా పార్టీకి భారీ షాక్ త‌గిలింది. న‌టి గౌతమి తాడిమ‌ళ్ల బీజేపీకి రాజీనామా చేశారు. ట్విట్ట‌ర్ వేదికగా ఈ విషయాన్ని వెల్లడించింది. త‌న‌ను మోసం చేసిన వ్య‌క్తికి బీజేపీ నాయ‌కులు స‌హ‌క‌రిస్తున్నార‌ని, అందుకే బీజేపీకి రాజీనామా చేస్తున్న‌ట్లు గౌత‌మి త‌న లేఖ‌లో చెప్పారు.

Also Read.. కాల్ రికార్డు నగ్న వీడియోగా మార్ఫింగ్.. ఓ యువకుడు బలి

‘‘నేను త‌న జీవితంలో ఊహించ‌లేని సంక్షోభంలో ఉన్నా. బీజేపీ అగ్ర నాయ‌క‌త్వం నుంచి త‌న‌కు ఎలాంటి మ‌ద్ద‌తు లేదు. త‌న‌ను మోసం చేసిన సీ అల‌గ‌ప్ప‌న్‌కు బీజేపీ నాయ‌క‌త్వం మ‌ద్ద‌తు ఇస్తుంది. త‌న‌ను ఎవరూ వంచించ‌లేరు. గ‌త 25 ఏండ్ల నుంచి బీజేపీ కోసం ఎంతో క‌ష్ట‌ప‌డ్డాను. న్యాయం కోసం పోరాడుతా.’’ అని ఆమె తెలిపారు. రాజీనామా లేఖ‌ను బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు జేపీ న‌డ్డా, త‌మిళ‌నాడు పార్టీ యూనిట్ చీఫ్ కే అన్న‌మ‌లైకు పంపినట్లు పేర్కొన్నారు.

Latest News

More Articles