Saturday, May 4, 2024

పాట ఉన్నన్ని రోజులు సాయిచంద్ పేరు శాశ్వతంగా ఉంటుంది.. బీఆర్ఎస్ నేతల నివాళి

spot_img

పాట రూపంలో అందరి గుండెల్లో చిరకాలం ఉంటారు.. హరీశ్ రావు
రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్, ప్రముఖ గాయకుడు, ఉద్యమ కారుడు సాయిచంద్ మృతి పట్ల రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య మంత్రి హరీశ్ రావు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తమ్ముడు సాయిచంద్ అకాల మరణం తనను ఎంతో బాధకు గురి చేసిందన్నారు. తన ఆట, పాటతో తెలంగాణ ఉద్యమంలో గొప్ప పాత్ర పోషించి, ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచారన్నారు. ఉద్యమంలో ఆయన పోషించిన పాత్రను తెలంగాణ సమాజం ఎన్నటికీ మరువదన్నారు. భౌతికంగా మన మధ్య లేకున్నా, పాట రూపంలో అందరి గుండెల్లో చిరకాలం నిలిచిపోతారని అన్నారు. సాయిచంద్ ఆత్మకు శాంతి చేకూరాలని ఆ దేవుడిని ప్రార్థించారు. కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతి తెలియచేశారు.

పాట ఉన్నన్ని రోజులు సాయిచంద్ పేరు శాశ్వతంగా ఉంటుంది.. కేటీఆర్
తెలంగాణ ఉద్యమకారుడు, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్, ప్రముఖ గాయకుడు సాయిచంద్ మృతిపై భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కే తారకరామారావు సంతాపం వ్యక్తం చేశారు. సాయి చంద్ మరణం తనని దిగ్భ్రాంతికి గురిచేసిందన్న కేటీఆర్, యువకుడైన సాయిచంద్ అకాల మరణం పట్ల తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ ఉద్యమ కాలం నుంచి తెలంగాణ సమాజానికి ముఖ్యంగా భారత రాష్ట్ర సమితి పార్టీకి తన గొంతుక ద్వారా ఎనలేని సేవలు చేసిన సాయిచంద్ మరణం తీరని లోటు అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా సాంస్కృతిక రంగంలో పాట ఉన్నన్ని రోజులు సాయిచంద్ పేరు శాశ్వతంగా నిలిచిపోతుందన్నారు. సాయిచంద్ ఆత్మకు శాంతి చేకూరాలని, ఆయన కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

తెలంగాణా ఉద్యమంలో సాయిచంద్ సేవలు చిరస్మరణీయం.. మంత్రి జగదీష్ రెడ్డి దిగ్భ్రాంతి
రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్, ప్రముఖ గాయకుడు సాయిచంద్ అకాల మరణం పట్ల రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తెలంగాణా ఉద్యమంలో ,తెలంగాణా పునర్నిర్మాణంలో సాయిచంద్ సేవలు చిరస్మరణీయంగా నిలిచి పోతాయన్నారు. సాయిచంద్ ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబ సభ్యులు మనోధైర్యంగా ఉండాలని ఆయన అన్నారు.

తన పాటలతో ప్రజా చైతన్యం తీసుకువచ్చిన గాయకుడు సాయిచంద్.. మంత్రి సబితా ఇంద్రారెడ్డి
కళాకారుడు, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ సాయిచంద్ అకాల మృతి పట్ల రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తెలంగాణ సమాజం గొప్ప గాయకున్ని కోల్పోయిందని పేర్కొన్నారు. తెలంగాణ సాధన కోసం, తెలంగాణ పునర్ నిర్మాణం కోసం తన గొంతుకను వినిపించిన సాయిచంద్ లేరన్న విషయాన్ని జీర్ణించుకోలేక పోతున్నానని మంత్రి తెలిపారు. సాయిచంద్ ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబ సభ్యులకు మనోధైర్యం ప్రసాదించాలని భగవంతున్ని వేడుకుంటున్నట్లు తెలిపారు.

తన పాటలతో ఎంతో మంది అభిమానులను సంపాదించాడు.. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్
తెలంగాణ ఉద్యమకారులు, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్, ప్రముఖ గాయకుడు సాయిచంద్ అకాల మృతి పట్ల రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తెలంగాణ ఒక గొప్ప కళాకారుడిని కోల్పోయిందన్నారు. తెలంగాణ ఉద్యమంలో, పునర్నిర్మాణంలో సాయి చంద్ ఎంతో కీలకమన్నారు. తన పాటలతో ఎంతో మంది అభిమానులను పొందారని, పేర్కొన్నారు సాయిచంద్ ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబ సభ్యులకు మనోధైర్యం ప్రసాదించాలని భగవంతుని ప్రార్థించారు.

తెలంగాణ ఒక గొప్ప గొంతుకను కోల్పోయింది.. మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్, ప్రముఖ గాయకుడు సాయిచంద్ మృతిపై రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సాయిచంద్ మరణం వార్త నమ్మలేకపోతున్నాను. తెలంగాణ ఒక గొప్ప గొంతుకను కోల్పోయింది. ఉద్యమంలో, పునర్నిర్మాణంలో తనది విస్మరించలేని పాత్ర. తన ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబ సభ్యులకు మనోధైర్యం ప్రసాదించాలని భగవంతుని ప్రార్దిస్తున్నాను.

సాయిచంద్ ఆత్మకు సద్గతులు కలగాలి.. మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి
రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్, ప్రముఖ గాయకుడు సాయిచంద్ హఠాన్మరణం పట్ల మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. సాయిచంద్ కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఆయన కుటుంబ సభ్యులకు మనోధైర్యాన్ని ఇవ్వాలని, ఆయన ఆత్మకు సద్గతులు కలగాలని భగవంతున్ని ప్రార్థించారు.

తెలంగాణ పునర్నిర్మాణంలో సాయి చంద్ ఎంతో కీలకం.. మంత్రి శ్రీనివాస్ గౌడ్
తెలంగాణ ఉద్యమకారులు, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్, ప్రముఖ గాయకుడు సాయిచంద్ అకాల మృతి పట్ల రాష్ట్ర ఎక్సైజ్, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక, పురావస్తు, యువజన సర్వీసుల శాఖల మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తెలంగాణ ఒక గొప్ప కళాకారుడిని కోల్పోయిందన్నారు. తెలంగాణ ఉద్యమంలో, పునర్నిర్మాణంలో సాయి చంద్ ఎంతో కీలకమన్నారు. సాయిచంద్ ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబ సభ్యులకు మనోధైర్యం ప్రసాదించాలని భగవంతుని ప్రార్థించారు.

తమ్ముడు సాయిచంద్ హఠాన్మరణం నన్ను తీవ్రంగా కలిచి వేసింది.. మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి
రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్,తెలంగాణ ఉద్యమ కారుడు,గాయకుడు సాయిచంద్ హఠాన్మరం నన్ను తీవ్రంగా కలిచి వేసింది. నాకు వ్యక్తిగతంగా ఎంతో బాధను కలిగిస్తోంది. ఎప్పుడు ఎదురైనా ఆప్యాయంగా బాల్కొండ బంగారు కొండ మా ప్రశాంత్ అన్న అని పిలిచే తమ్ముడు ఇక లేడంటే నమ్మలేక పోతున్న. తన ఆట,పాటతో తెలంగాణ ఉద్యమంలో గొప్ప స్ఫూర్తి వంతమైన పాత్ర పోషించి,సమాజానికే ఆదర్శంగా నిలిచిన సోదరుడు సాయి చంద్ భౌతికంగా మనకు దూరమైనా,తన గాత్రం రూపంతో మన మధ్య సజీవంగా ఉంటాడు. వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నా. వారి కుటుంబానికి ఆ భగవంతుడు మనోధైర్యం ప్రసాదించాలని కోరుకుంటూ వారికి నా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నా.

మంత్రి గంగుల కమలాకర్
రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్, ప్రముఖ గాయకుడు సాయిచంద్ మృతిపై రాష్ట్ర బీసీ సంక్షేమ పౌరసరఫరాల శాఖ మంత్రివర్యులు గంగుల కమలాకర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సాయిచంద్ మరణవార్త తీవ్రంగా కలచి వేసిందని అన్నారు. తెలంగాణ ఒక గొప్ప గొంతుకను కోల్పోయిందని. ఉద్యమంలో, పునర్నిర్మాణంలో తనది విస్మరించలేని పాత్ర అని, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబ సభ్యులకు మనోధైర్యం ప్రసాదించాలని భగవంతుడిని ప్రార్దిస్తున్నాని పేర్కొన్నారు.

మంత్రి పువ్వాడ అజయ్ కుమార్
తెలంగాణ ఉద్యమకారులు, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్, ప్రముఖ గాయకుడు సాయిచంద్ అకాల మృతి పట్ల రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తెలంగాణ ఒక గొప్ప కళాకారుడిని కోల్పోయింది. తెలంగాణ ఉద్యమంలో, పునర్నిర్మాణంలో సాయిచంద్ ఎంతో కీలకం. సాయిచంద్ ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబ సభ్యులకు మనోధైర్యం ప్రసాదించాలని భగవంతుని ప్రార్థిస్తున్నానన్నారు.

మంత్రివర్యులు చామకూర మల్లారెడ్డి
తెలంగాణ ఉద్యమకారులు, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్, ప్రముఖ గాయకుడు సాయిచంద్ అకాల మృతి పట్ల రాష్ట్ర కార్మిక ఉపాధి కల్పన శాఖ మంత్రివర్యులు చామకూర మల్లారెడ్డి గారు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తెలంగాణ ఒక గొప్ప కళాకారుడిని కోల్పోయిందన్నారు. తెలంగాణ ఉద్యమంలో, పునర్నిర్మాణంలో సాయి చంద్ ఎంతో కీలకమన్నారు. తన పాటలతో ఎంతో మంది అభిమానులను పొందారని పేర్కొన్నారు. సాయిచంద్ ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబ సభ్యులకు మనోధైర్యం ప్రసాదించాలని భగవంతుని ప్రార్థించారు.

సాయిచంద్ స్వరం తెలంగాణ ఉద్యమానికి ఆయుపట్టుగా నిలిచింది.. మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు
తెలంగాణ ఉద్యమకారుడు, ప్రముఖ కవిగాయకుడు, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ సాయిచంద్ మరణవార్త తెలియగానే తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యానని మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు అన్నారు. సాయి చంద్ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. సాయిచంద్ స్వరం తెలంగాణ ఉద్యమానికి ఆయుపట్టుగా నిలిచింది. తెలంగాణ పునర్నిర్మాణంలో ఉద్యమ స్ఫూర్తితో పని చేశారు. తెలంగాణ రాష్ట్రం ఒక గొప్ప కళాకారున్ని కోల్పోయింది. మంచి భవిష్యత్తు ఉన్న సాయిచంద్ మరణం తెలంగాణకు తీరని లోటు. సాయిచంద్ చిన్న వయస్సులో గుండెపోటుతో మృతి చెందడం బాధాకరం. ఆయన కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతిని, సంతాపాన్ని తెలుపుతున్నాను.

మంత్రివర్యులు సత్యవతి రాథోడ్
తెలంగాణ ఉద్యమకారులు, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్, ప్రముఖ గాయకుడు సాయిచంద్ అకాల మృతి పట్ల రాష్ట్ర గిరిజన, స్త్రీ – శిశు సంక్షేమ శాఖల మంత్రి వర్యులు శ్రీమతి సత్యవతి రాథోడ్ గారు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తెలంగాణ ఉద్యమంలో, పునర్నిర్మాణంలో సాయి చంద్ గొప్ప పాత్ర పోషించారన్నారు. సాయిచంద్ ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబ సభ్యులకు మనోధైర్యం ప్రసాదించాలని మంత్రి భగవంతున్ని ప్రార్థించారు.

కళాకారుడి గొంతు అకాలంగా మూగ పోయింది.. ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ 
ప్రముఖ గాయకుడు, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ సాయి చంద్ మృతి చెందడం పట్ల రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. యువ గాయకుడు, కళాకారుడి గొంతు అకాలంగా మూగ పోయిందని, సాయిచంద్ అకాల మరణం తనను కలిచి వేసిందని వినోద్ కుమార్ అన్నారు. సాయి చంద్ కుటుంబ సభ్యులకు వినోద్ కుమార్ తన ప్రగాఢ సానుభూతిని, సంతాపాన్ని తెలిపారు.

కళామతల్లి ఓ గొప్ప కళాకారుడిని కోల్పోయింది.. ఖమ్మం పార్లమెంట్ సభ్యులు నామ నాగేశ్వరరావు
ప్రముఖ గాయకులు, తెలంగాణా ఉద్యమంలో తన గళంతో కీలక పాత్ర పోషించిన రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ సాయిచంద్ అకాల మృతికి ఎంపీ నామ నాగేశ్వరరావు సంతాపం వ్యక్తం చేశారు. సాయిచంద్ మృతి నన్ను ఎంతగానో కదిలించింది. సాయిచంద్‎తో నాకు ఎంతో అనుబంధం, ఆత్మీయ బంధం ఉంది. కళామతల్లి ఓ గొప్ప కళాకారుడిని కోల్పోయింది. వారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి.

సాయిచంద్ ఆత్మకు శాంతి చేకూరాలి.. స్పీకర్ పోచారం శ్రీనివాస రెడ్డి
రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్, ప్రముఖ గాయకుడు సాయిచంద్ మృతిపై తెలంగాణ రాష్ట్ర శాసన సభాపతి పోచారం శ్రీనివాస రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సాయిచంద్ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్ధిస్తూ, వారి కుటుంబ సభ్యులకు స్పీకర్ పోచారం తన సానుభూతిని తెలిపారు.

సోదరుడు సాయిచంద్ అకాల మరణం నన్ను ఎంతో కలచివేసింది.. ఎమ్మెల్సీ కవిత
తెలంగాణ ఉద్యమంలో తన ఆట, పాటలతో ప్రజలను చైతన్యవంతులను చేసిన కళాకారుడు, రాతి బొమ్మల్లోన కొలువైన శివుడా అంటూ తన పాటతో ఎన్నో హృదయాలను కదిలించిన సోదరుడు సాయిచంద్ అకాల మరణం నన్ను ఎంతో కలచివేసింది. సాయిచంద్ పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తూ, వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలుపుతున్నాను.

తెలంగాణ ఒక గొప్ప గొంతుకను కోల్పోయింది.. కొప్పుల ఈశ్వర్
రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్, ప్రముఖ గాయకుడు సాయిచంద్ మృతిపై రాష్ట్ర సంక్షేమ శాఖా మంత్రి కొప్పుల ఈశ్వర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సాయిచంద్ మరణం వార్త తీవ్రంగా కలచి వేసింది.. తెలంగాణ ఒక గొప్ప గొంతుకను కోల్పోయింది. ఉద్యమంలో, పునర్నిర్మాణంలో తనది విస్మరించలేని పాత్ర. తన ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబ సభ్యులకు మనోధైర్యం ప్రసాదించాలని భగవంతుడిని ప్రార్దిస్తున్నాను.

మన్నె శ్రీనివాస్ రెడ్డి, ఎంపీ మహబూబ్ నగర్
తెలంగాణ గడ్డ ముద్దాడిన ముద్దు బిడ్డ, ఈ ప్రాంత మట్టి బిడ్డ సాయచంద్. తెలంగాణ మలిదశ ఉద్యమంలో యావత్ తెలంగాణ ప్రజానీకాన్ని తన పాట మాటతో చైతన్యవంతులను చేశాడు. రాష్ట్ర సాధనలో కీలకపాత్ర పోషించి, రాష్ట్రం ఇప్పుడిప్పుడే పువ్వులా వికసిస్తున్న తరుణంలో తన ఆకాంక్షను కళ్ళారా చూసే సమయంలో అకస్మాత్తుగా మృతి చెందిన ప్రజా గాయకుడు సాయి చందు మరణం యావత్ తెలంగాణ రాష్ట్రానికే కాకుండా ఈ ప్రాంతాన్ని కూడా తీరని లోటు. ఆ లోటును ఎవరు తీర్చలేనిది. వారి ఆత్మకు ఆ భగవంతుడు శాంతిని చేకూర్చాలని వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపాన్ని తెలియచేస్తున్నాను.

పాట రూపంలో సాయి చంద్ ఎప్పటికీ బతికే ఉంటారు.. ఎంపీ రంజిత్ రెడ్డి
తెలంగాణ ఉద్యమకారుడు, ప్రజా గాయకుడు, తెలంగాణ రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ సాయి చంద్ హఠాన్మరణం చాలా బాధాకరం. అయన మరణం నన్ను ఎంతగానో కలిచి వేసింది. వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి. సాయిచంద్ పాడిన పాటలు తెలంగాణ ప్రజల మనసులో ఎప్పటికీ సజీవంగా ఉంటాయి. పాట రూపంలో సాయి చంద్ ఎప్పటికీ బతికే ఉంటారు.

తెలంగాణ ఒక భవిష్యత్ నాయకుడిని కోల్పోయింది.. శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి
రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్, ప్రముఖ గాయకుడు సాయిచంద్ మృతిపై తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రం ఒక గొప్ప గాయకున్ని, భవిష్యత్ నాయకున్నీ కోల్పోయిందని ఆయన తెలిపారు. తన ఆట పాటలతో తెలంగాణ ఉద్యమంలో అలాగే తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణం లో సాయి చందు పాత్ర విశేషమైనదని ఆయన అన్నారు.సాయి చందు పవిత్రమైన ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబ సభ్యులకు మనోధైర్యం ప్రసాదించాలని భగవంతుణ్ణి గుత్తా సుఖేందర్ రెడ్డి ప్రార్ధించారు.

సాయిచంద్ మరణం వార్త నమ్మలేకపోతున్నా.. డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్
రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్, ప్రముఖ గాయకుడు సాయిచంద్ మృతిపై డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సాయిచంద్ మరణం వార్త నమ్మలేకపోతున్నానని తెలిపారు.తెలంగాణ ఒక గొప్ప గొంతుకను కోల్పోయింది. ఉద్యమంలో, పునర్నిర్మాణంలో తనది విస్మరించలేని పాత్ర అంటూ , తన ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబ సభ్యులకు మనోధైర్యం ప్రసాదించాలని భగవంతుని ప్రార్దిస్తున్నాను తెలిపారు. సికింద్రాబాద్ ఇంపీరియల్ గార్డెన్‎లో ఏర్పాటుచేసిన టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ సభలో తొలిసారిగా పాడిన రాతి బొమ్మల్లో కొలువైన శివుడా పాటతో గుర్తింపు పొందిన సాయి చంద్ మరణం తీరనిలోటన్నారు.

ఎమ్మెల్యే చిట్టెం రాంమోహన్ రెడ్డి
తెలంగాణ రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ సాయిచంద్ మరణ వార్త తెలిసి మక్తల్ ఎమ్మెల్యే చిట్టెం రాంమోహన్ రెడ్డి, సుచరిత దంపతులు హైదరాబాద్ కేర్ హాస్పిటల్‎కు చేరుకున్నారు. సాయి చంద్ మరణ వార్త తమను ఎంతగానో కలచి వేసిందని, వారి కుటుంబానికి ప్రగాఢ సంతాపం తెలియజేశారు.

ఎమ్మెల్యే కాలే యాదయ్య
ప్రముఖ గాయకుడు, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ సాయి చంద్ మృతి చెందడం పట్ల ఎమ్మెల్యే యాదయ్య గారు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. యువ గాయకుడు, కళాకారుడి గొంతు అకాలంగా మూగ పోయిందని, సాయిచంద్ అకాల మరణం తనను కలిచి వేసిందని అన్నారు. సాయి చంద్ కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని, సంతాపాన్ని తెలిపారు.

ఎమ్మెల్సీ కడియం శ్రీహరి
తెలంగాణ ఉద్యమకారులు, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్, ప్రముఖ గాయకుడు సాయిచంద్ అకాల మృతి పట్ల మాజీ ఉప ముఖ్యమంత్రి ఎమ్మెల్సీ కడియం శ్రీహరి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తెలంగాణ ఉద్యమంలో, పునర్నిర్మాణంలో సాయిచంద్ గొప్ప పాత్ర పోషించారన్నారు. సాయిచంద్ ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబ సభ్యులకు మనోధైర్యం ప్రసాదించాలని కడియం భగవంతున్ని ప్రార్థించారు.

సాయి చంద్‎తో నాకున్న ఉద్యమ అనుబంధం ఎంతో గొప్పది.. ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి
తెలంగాణ ఉద్యమకారుడు, రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్, అద్భుతమైన కళాకారుడు, తెలంగాణ ఉద్యమంలో తన పాటలతో ప్రజలను చైతన్యపరిచిన ‘త్రిపురనేని సాయిచంద్’ నిన్నరాత్రి గుండెపోటుతో ఆకస్మికంగా మరణించారు. వారి మరణం పట్ల ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తూ నివాళులర్పించారు. సాయి చంద్‎తో తనకున్న ఉద్యమ అనుబంధం ఎంతో గొప్పదన్నారు. ఇటీవల దుగ్గొండి మండలం చలపర్తి గ్రామంలో సాయి చంద్ చేతుల మీదుగానే నూతన గోదాంను కూడా ప్రారంభించుకోవడం జరిగిందని, నేడు వారు మన మధ్య లేకపోవడం ఎంతో బాధాకరంగా ఉందని ఎమ్మెల్యే తన సంతాపాన్ని వ్యక్తం చేశారు.

తెలంగాణ యాసను, గోసను పాట రూపంలో చెప్పిన గొప్ప వ్యక్తి.. ఆల వెంకటేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్యే 
ప్రముఖ గాయకులు, తెలంగాణ రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ సాయి చంద్ గుండెపోటుతో హఠాత్మరణం చెందడం తీవ్రంగా కలచివేసింది. ఉద్యమ సమయంలో తెలంగాణ యాసను, గోసను అనేక వేదికలపై పాట రూపంలో నినదించిన సాయి చంద్ చిన్న వయసులోనే మరణించడం దురదృష్టకరం. వారి ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తూ వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. మీ స్వరానికి మరణం లేదు.. పాట ఉన్నంత వరకు మీరు మాతోనే ఉంటారు.

ఆటపాటలతో బీఆర్ఎస్ మీటింగ్స్ అన్ని విజయవంతం చేశాడు.. ప్రభుత్వ విప్ బాల్క సుమన్
తన మాటలు, పాటలతో బీఆర్ఎస్ మీటింగ్స్ అన్ని విజయవంతం చేశాడు. సాయి చంద్ మరణం అందరినీ తీవ్రంగా కలిచివేసింది. చిన్న వయసులోనే చనిపోవడం బాధాకరం. బీఆర్ఎస్ పార్టీ కోసం ఎంతో కృషి చేశాడు. సాయంత్రం సాహెబ్ నగర్ స్మశానవాటికలో సాయిచంద్ అంత్యక్రియలు జరుగుతాయి.

దేశపతి శ్రీనివాస్ ఎమ్మెల్సీ
ఉద్యమంలోకి సుడిగాలిలా వచ్చి ఎన్నో పాటలు పాడాడు. బీఆర్ఎస్ సభల్లో గంటలకొద్దీ పాటలు పాడాడు. సాయిచంద్ చనిపోవడం చాలా బాధగా ఉంది. గొప్ప గాయకుడిగా తెలంగాణ ప్రజల గుండెల్లో నిలిచిపోతాడు.

సాయి చంద్ లేని పాటను ఊహించలేకపోతున్నా.. జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి
రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ కవి గాయకుడు సాయిచంద్ అకాల మరణం పట్ల హైదరాబాద్ నగర మేయర్ గద్వాల విజయలక్ష్మి తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. సాయిచంద్ లేని పాటను ఊహించలేకపోతున్నా. గాయకుడితోపాటు ఒక నాయకుడిని కూడా కోల్పోయాం. సాయిచంద్ ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబానికి మనోధైర్యాన్ని కల్పించాలని భగవంతున్ని ప్రార్థిస్తున్నా.

శాసనమండలి డిప్యూటీ చైర్మన్ డా. బండ ప్రకాశ్
తెలంగాణ ఉద్యమంలో తన పాటలతో ప్రజా చైతన్యం తీసుకువచ్చిన ప్రముఖ గాయకుడు. కళాకారుడు రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ సాయిచంద్ అకాల మృతి పట్ల శాసనమండలి డిప్యూటీ చైర్మన్ డా.బండ ప్రకాశ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తెలంగాణ సమాజం గొప్ప గాయకున్ని కోల్పోయిందని పేర్కొన్నారు. తెలంగాణ సాధన కోసం, తెలంగాణ పునర్ నిర్మాణం కోసం తన గొంతుకను వినిపించిన సాయిచంద్ లేరన్న విషయాన్ని జీర్ణించుకోలేక పోతున్నానని బండ ప్రకాశ్ తెలిపారు. సాయిచంద్ ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబ సభ్యులకు మనోధైర్యం ప్రసాదించాలని భగవంతున్ని వేడుకుంటున్నట్లు తెలిపారు.

Latest News

More Articles