Monday, May 6, 2024

నేడు చింతమడకకు ముఖ్యమంత్రి కేసీఆర్ దంపతులు..!!

spot_img

తెలంగాణ సీఎం కేసీఆర్ దంపతులు నేడు సిద్దిపేట జిల్లాలోని చింతమడక గ్రామంలో ఓటును వినియోగించుకోనున్నారు. అందుకే ఇవాళ చింతమడకకు వెళ్తున్నారు. గ్రామంలోని 13వ పోలింగ్ కేంద్రంలో ఉదయం 7.30గంటలకు ఓటును వినియోగించుకోనున్నారు. సీఎంకు చింతమడక గ్రామం ఒక సెంటిమెంట్. సీఎం దంపతులు చింతమడకకు వెళ్తుండటంతో భారీ భద్రతను ఏర్పాటు చేశారు. ఓట్ల లిస్టులో కేసీఆర్ సీరియల్ నెంబర్ 158గా ఉంది. ఓటరు కార్డు సంఖ్య SAG 0399691గా ఉంది. సీఎం సతీమణి శోభమ్మ సీరియల్‌ నంబర్ 159, ఓటరు కార్డు నంబర్ SAG 0761676గా ఉంది. సీఎం ఓటు వేసేందుకు చింతమడకు వెళ్తుండటంతో స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నరు.

ఇది కూడా చదవండి: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సర్వం సిద్ధం

Latest News

More Articles