Friday, May 10, 2024

కాంగ్రెస్‌ పరిపాలనలో సింగరేణి నష్టాల్లో ఉండేది

spot_img

కొత్తగూడెం: కాంగ్రెస్‌ పరిపాలనలో 134 సంవత్సరాల చరిత్ర ఉన్న సింగరేణి నష్టాల్లో ఉండేదని సీఎం కేసీఆర్‌ అన్నారు. సింగరేణిని కాంగ్రెస్ నాశనం చేసింది. అప్పట్లో కేంద్రం నుంచి అప్పుల్ని తెచ్చి 30-40 ఏళ్లు కట్టలేదు. దీంతో సింగరేణిలో కేంద్రానికి 49 శాతం వాటా పోయింది. లేదంటే తెలంగాణ కొంగుబంగారమైన సింగరేణి ఆస్తులు మొత్తం ఈరోజు మనదగ్గరనే ఉండేదన్నారు. నేటి యువత సింగరేణి చరిత్రను తెలుసుకోవాలన్నారు.

Also Read.. అభ్యర్థి గుణగణాలు, పార్టీ చరిత్రను చూసి ఓటు వేయాలి

కొత్తగూడెంలో నిర్వహించిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో సీఎం పాల్గొని మాట్లాడారు. తెలంగాణ వచ్చిన వెంటనే 3 శాతం ఇంక్రిమెంట్‌ ఇచ్చామని తెలిపారు. సమైక్య రాష్ట్రం ఉంటే కొత్తగూడెం జిల్లా వచ్చేది కాదని, కొత్తగూడేనికి ప్రభుత్వ వైద్య కళాశాల వచ్చిందన్నారు. కొత్తగూడెం నియోజకవర్గంలో 13,500 ఎకరాల పోడు భూమికి పట్టాలిచ్చామని గుర్తుచేశారు.

Also Read.. సీఎం కేసీఆర్‌ వాహనాన్ని తనిఖీ చేసిన ఎన్నికల అధికారులు

కంపెనీ టర్నోవర్‌ కాంగ్రెస్‌ రాజ్యంలో రూ.11 వేల కోట్లు ఉండేది. దాన్ని ఈ రోజు రూ.33 వేల కోట్లకు తీసుకుపోయినం. సింగరేణి లాభాలు రూ.419 కోట్లు ఉండేది. దాన్ని రూ.2,184 కోట్లకు తీసుకుపోయినం. గతంలో కార్మికులకు పంచే లాభం ఏటా 60, 70 కోట్లు ఉండేది. కానీ ఈ దసరాకు మనం పంచిన లాభం రూ.700 కోట్లు. నూతన నియామకాల వల్ల సింగరేణి యువ కార్మికులతో కళకళలాడుతున్నదని సీఎం చెప్పారు.

Also Read.. దివ్యాంగులకు వెన్ను దన్నుగా సీఎం కేసీఆర్

తెలంగాణ రాకముందు 6400 ఉద్యోగాలు వస్తే, తెలంగాణ వచ్చిన తర్వాత తొమ్మిదిన్నర ఏళ్లలో 19,463 మంది ఉద్యోగాలిచ్చినం. బీఆర్‌ఎస్‌ గవర్నమెంట్‌ వచ్చాక డిపెండెంట్‌ ఉద్యోగాలను పునరుద్ధరించాం. దాని ద్వారా 15,256 మందికి ఉద్యోగాలిచ్చాం. గతంలో కార్మికులు చనిపోతే ఒక లక్ష రూపాయలు ఇచ్చి చేతులు దులుపుకునేవాళ్లని,ఇప్పుడు రూ.10 లక్షలు ఇస్తున్నట్లు తెలిపారు. డిపెండెంట్‌ ఉద్యోగం తీసుకోకపోతే రూ.25 లక్షలు ఇస్తున్నం. కార్మికులు తీసుకునే ఇంటి రుణానికి వడ్డీ మొత్తం సింగరేణి చెల్లిస్తున్నది. రూ.10 లక్షలు వడ్డీలేని రుణాలు ఇస్తున్నది. సింగరేణి స్థలాల్లో నివాసం ఉంటున్న 22 వేల మందికి జీవో 76 ద్వారా ఇళ్ల పట్టాలు అందజేయడం జరిగిందని ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు.

Latest News

More Articles