Friday, May 10, 2024

అభ్యర్థి గుణగణాలు, పార్టీ చరిత్రను చూసి ఓటు వేయాలి

spot_img

కొత్తగూడెం: ఎన్నికలు రాగానే ఆగం ఆగం కావద్దు. నిమ్మలంగా ఆలోచన చేసి ఓటు వేయాలి. విపక్షాల మాటల మాయలో పడొద్దు. వారు గందరగోళ పరిస్థితి తెచ్చేందుకు కుట్రలు చేస్తారని సీఎం కేసీఆర్‌ అన్నారు. 50 ఏళ్ల కాంగ్రెస్ పాలనను, 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనను బేరీజు వేసుకొవాలన్నారు. కొత్తగూడెంలో నిర్వహించిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో సీఎం పాల్గొని మాట్లాడారు.

Also Read.. దివ్యాంగులకు వెన్ను దన్నుగా సీఎం కేసీఆర్

దేశంలో ఆలోచించి ఓటు వేసే పరిస్థితులు రావాలి. తెలంగాణ తెచ్చిన వాడిగా.. తెలంగాణ బోగోగులు కోరుకున్న వాడిగా చెబుతున్నా.. తమషాగా ఓటు వేయొద్దు. ఎవడో చెబితే ఓటు వేయొద్దు. బాగా ఆలోచించి పరిణతితో ఓటు హక్కును వినియోగించుకోవాలి. ఎన్నికలొస్తే అబద్ధాలు చెప్పడం, బూతులు తిట్టుకోవడం, మోసపూరిత వాగ్ధానాలు. ఇదీ మన దేశంలో జరుగుతున్న తంతు అన్నారు. ప్రజల చేతిలో ఉన్న ఒకే ఒక్క వజ్రాయుధం లాంటి ఆయుధం ఓటు. ఆ ఓటు ఆగమాగం వేస్తే మన తలరాత కింద మీదైతది. ప్రజలు కోరుకున్న వాళ్లు గెలిచినప్పుడే అది ప్రజల గెలుపు అయితదన్నారు.

Also Read.. కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్

పోటీ ఉన్న అభ్యర్థి గుణగణాలు చూసి ఓటు వేయాలి. అభ్యర్థుల వెనుక ఉన్న పార్టీ చరిత్రను చూడాలి. వారి వైఖరులను గమనించారు. రాష్ట్ర అభివృద్ధికి వారు ఏ విధంగా ఉపయోగపడతారో ఆలోచన చేయాలని సూచించారు. కొత్తగూడెం వనమా వెంకటేశ్వరరావు మంచి వ్యక్తి. ఎప్పుడు నియోజకవర్గం గురించే ఆలోచనలు చేస్తారు. అలాంటి వ్యక్తికి ప్రజలు మరో సారి ఆశీర్వదించాలని కోరారు.

Latest News

More Articles