Friday, May 10, 2024

సీఎం కేసీఆర్‌ వాహనాన్ని తనిఖీ చేసిన ఎన్నికల అధికారులు

spot_img

భద్రాద్రి కొత్తగూడెం : బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ ఎన్నికల ప్రచార వాహనాన్ని ఎన్నికల అధికారులు తనిఖీ చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం కేసీఆర్ కొత్తగూడెం చేరుకున్న సమయంలో ఇది జరిగింది.

Also Read.. అభ్యర్థి గుణగణాలు, పార్టీ చరిత్రను చూసి ఓటు వేయాలి

సీఎం ప్రయాణించే ప్రగతిపథం వాహనాన్ని విధి నిర్వహణలో భాగంగా ఎన్నికల కమిషన్ అధికారులు తనిఖీ చేశారు. ఎన్నికల నిబంధనలను అనుసరించి పోలీసులకు సీఎం కేసీఆర్‌ పూర్తిగా సహకరించారు. తనిఖీకి సహకరించిన సీఎం కేసీఆర్‌కు పోలీసులు ధన్యవాదాలు తెలిపారు.

Latest News

More Articles