Monday, May 6, 2024

రైతుల పట్ల కాంగ్రెస్ వైఖరి డేంజర్.. తస్మాత్ జాగ్రత్త.. లేదంటే ఐదేండ్లు ఆగమే

spot_img

రంగారెడ్డి జిల్లా: తెలంగాణ కోసం పుట్టిందే బీఆర్ఎస్. హక్కులు, రాష్ట్రం కోసం పోరాటం చేశాం. రాష్ట్రం వచ్చిన కొత్తలో అనేక సమస్యలు ఉండె. కరెంట్, నీళ్లు, రైతుల ఆత్మహత్యలు, చేనేతె కార్మికుల ఆత్మహత్యలు, సాగు లేక వలసలు పోయేవారు. రాష్ట్రం వచ్చాక ఒక్కో సమస్యను పరిష్కరించుకుంటూ వస్తున్నాం. ఇప్పుడు దాదాపు సమస్యలన్ని తీరాయి. 24 గంటల ఉచిత కరెంట్, రైతుబంధు, మంచి మద్దతు ధరతో రైతుల మొఖం తెల్లబడుతుంది. ఇది ఇలాగే కొనసాగాల్సి ఉందని సీఎం కేసీఆర్ అన్నారు. ఎన్నికలు రాగానే ఆగం కావొద్దు. గ్రామంలో చర్చ పెట్టి.. జరిగిన అభివృద్ధిని బేరీజు వేసుకోవాలి. అభ్యర్థుల పనితీరు, గుణగణాలతోపాటు పార్టీల చరిత్రను చూడాలి. వాటి పాలన సామర్థ్యాలు, వైఖరులను తెలుసుకోవాలి. బాగా ఆలోచన చేసి ఓటు వేయాలి. ఎవరి పాలనలో రాష్ట్రం బాగు పడతదో ఆలోచన చేసి ఓటు వేయాలని కేసీఆర్ ప్రజలకు సూచించారు. ఇబ్రహీంపట్నంలో నిర్వహించిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో ఆయన పాల్గొని మాట్లాడారు.

Also Read.. ఎన్నికల బరిలో 2,898 మంది అభ్యర్థులు

ఇవాళ తలసరి ఆదాయం, తలసరి విద్యుత్ విషయంలో దేశంలోనే తెలంగాణ నెంబర్ వన్ స్థానంలో ఉంది. విద్య, వైద్యం ఇలా అనేక విషయంలో ముందుకుపోతున్నం. ఒక క్రమపద్ధతిలో చేసుకుంటూ వస్తున్నాం. ఇబ్రహీంపట్నం చెరువు ఎండిపోయి వట్టిపోయింది. ఓసారి వాటర్ వర్క్స్ నీళ్లతో నింపినం అయినా నిండలేదు. దీంతో పైనున్న కాల్వలను క్లీన్ చేయించాం. ఇప్పుడు నీళ్లతో నిండిన చెరువును చూస్తే.. కండ్లకు మంచిగా అనిపిస్తుంది. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టులపై కాంగ్రెసోళ్లు 194 కేసులు వేసారు. ఇటీవల అవన్నీ క్లియర్ అయి మొన్ననే ప్రారంభించుకున్నాం. త్వరలోనే సాగు నీరు వస్తది. మునుగోడు రిజర్వాయర్ నిండి.. బ్రహ్మండంగా చెరవులు నిండి లక్ష ఎకరాలకు సాగునీరు అందుతుందని తెలిపారు.

Also Read.. ఖమ్మంపై నాకున్న ప్రేమ.. బయటి నుండి వచ్చిన తుమ్మలకు ఉంటదా?

రైతులు బాగు కోసం రైతుబంధు తెచ్చినం. ఇలాంటిది ప్రపంచంలో ఎక్కడా లేదు. ఈరోజు నీటి ట్యాక్స్ లేదు. పాత బకాయిలు రద్దు చేసినం. నాణ్యమైన కరెంట్ ను ఉచితంగా 24 గంటలపాటు ఇస్తున్నాం. దురదృష్టవశాత్తు రైతు మరణిస్తే 5 లక్షలు ఇస్తున్నం. ప్రభుత్వానికి నష్టమొచ్చిన ధాన్యం చివరి గింజ వరకు కొంటున్నం. భూములు ఎవరూ కాజేయకుండా ధరణి తెచ్చినం. బీఆర్ఎస్ రైతు ప్రభుత్వం. భూమిపై అధికారాన్ని ప్రజలకే కట్టబెట్టినం. ఇవాల పెరిగిన భూముల ధరలకు ధరణి లేకపోతే ఎన్నో సమస్యలు వచ్చేవి. ధరణి సాయంతోనే రైతుబంధు, ధాన్యం కొన్నడబ్బు, రైతు బీమా పైసలు నేరుగా అకౌంట్లోనే పడుతున్నాయి. కానీ ఇవాల కాంగ్రెసోళ్లు రాహుల్, భట్టీ, రేవంత్ అనేటోళ్లు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు. ధరణి తీసి బంగాళాఖాతంలో వేస్తే ఎట్లా అయితది. మళ్లీ దళారుల రాజ్యం తెచ్చేందుకు వాళ్లు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇది చాలా డేంజర్. ధరణి తెచ్చినోళ్లు ఉండాలంటే.. మంచిరెడ్డి కిషన్ రెడ్డిని భారీ మెజారిటీతో అసెంబ్లీకి పంపాలని కోరారు.

Also Read.. కేసీఆర్ కోసం దేశం చూస్తోంది.. బీఆర్ఎస్ గెలుపును ఎవరూ ఆపలేరు

ఉత్తమ్ కుమార్ అనేటాయన రైతుబంధు దుబారా అంటున్నడు. కిషన్ రెడ్డిని గెలిపిస్తే రైతుబంధు 16 వేలు అయితది. ఇవన్ని విషయాలపై గ్రామాల్లో చర్చ జరగాలి. 3 గంటల కరెంట్ చాలని రేవంత్ అంటున్నాడు. 10 హెచ్.పీ మోటర్ పెట్టుకోవాలంటున్న వాడు వాటిని 33 లక్షల మంది రైతులకు కొనిస్తడా? లేక వాళ్లయ్యా కొనిస్తడా? రైతులు ఇవన్ని గమనించాలి. నేను రైతును కాబట్టే వాళ్ల సమస్యలు నాకు తెలుసు. ప్రధాని మోడీ నన్ను బెదిరించిండు. అయినా మోటర్లకు మీటర్లు పెట్టలే. ఇప్పటివరకు 25 వేల కొట్లు రావాల్సినవి ఆపిండ్రు. ఒక్క నవోదయ స్కూలును, మెడికల్ కాలేజీని ఇవ్వని బీజేపీ ఎందుకు ఓటు వేయాలి? రైతులకు ప్రమాదం పొంచి ఉన్నది. రైతులు ఆలోచన చేయాలి. మంచి ఏదో.. చెడ్డ ఏదో ఆలోచన చేసి ఓటు వేయాలి. రింగురోడ్డుతో రేపు ఇబ్రహీంపట్నం ముఖచిత్రం మారిపోతుంది. ఇవన్ని జరగాలంటే.. కిషన్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని సీఎం కేసీఆర్ ప్రజలను కోరారు.

Latest News

More Articles