Wednesday, May 8, 2024

ఖమ్మం ప్రజలను గుత్త పట్టినారా? పొంగులేటి, తుమ్మలపై సీఎం కేసీఆర్ ఫైర్

spot_img

ఖమ్మం: రాజకీయం అరాచకంగా మాట్లొందు కదా? ప్రజాస్వామంలో మాటలకు కూడా పరిమితి ఉంటుంది. ఖమ్మం ప్రజలను ఏమన్న గుత్త పట్టినారా? అని సీఎం కేసీఆర్ నిలదీశారు. ఒక్క బీఆర్ఎస్ ఎమ్మెల్యేను కూడా ఖమ్మం నుంచి అసెంబ్లీలో అడుగు పెట్టనీయనని ఓ అర్భకుడు(పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి) మాట్లాడుతా ఉన్నడు. ఖమ్మం ప్రజలను వీరేమైనా గుత్తపట్టినారా? జిల్లా జిల్లాను కొనేసినవా? ఖమ్మం జిల్లా ప్రజలు దీన్ని సహిస్తరా? ప్రజాస్వామ్య వాదులు దీన్ని సమర్థిస్తరా? ఇది ఎంత వరకు ధర్మం? అని మండిపడ్డారు. చైతన్య వంతమైన జిల్లా ఇది. ఇది పోరాటాల ఖిల్లా. ఇక్కడ కమ్యూనిస్టు పార్టీ ఎంతో చైతన్యం తెచ్చినాయ్. అందుకే ప్రజలు విచక్షణాహితంగా ఎవరూ గెలిస్తే రాష్ట్ర ప్రయోజనాలకు మంచిదో..ఎవరి చేతుల్లో ఉంటే సురక్షితంగా ఉంటదో.. ఆలోచన చేసి ఓటు వేయాలని సీఎం కోరారు. ఖమ్మంలో నిర్వహించిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ పాల్గొని మాట్లాడారు.

గతంలో ఇక్కడ అజయ్ చేతిలో ఓడి మూలన కూర్చున్న ఓ పెద్దయిన(తుమ్మల నాగేశ్వరరావు)కు మంత్రి చేసి జిల్లాను అప్పగించిన. ఆయన సాధించిన ఫలితం గుండు సున్నా. ఆయనకు నేను మంత్రి పదవి ఇచ్చిన అని చెబితే.. ఆయనే నాకు మంత్రి ఇచ్చాడని చెబుతుండు. ఈ చరిత్ర అంతా ఖమ్మం ప్రజల ముందే జరిగింది కదా. ఖమ్మంలో వీరిద్దరి పీడ వదిలించినం. ఇవాళ ఖమ్మం శుభ్రంగా ఉన్నది. ఖమ్మంలో మంచి ఫలితాలు రాబోతున్నాయి. ఖమ్మం. ప్రతిపక్షాలకు దిమ్మ తెగిగే ఫలితాలు ఇవ్వాలని సీఎం కేసీఆర్ కోరారు.

Also Read.. పువ్వాడ పువ్వులు కావాలా? తుమ్మల తుంపలు కావాలా?

బీజేపీ, కాంగ్రెస్ పార్టీ ఎన్నడైన తెలంగాణ జెండా ఎత్తాయా? తెలంగాణ ఉద్యమాన్ని ఏనాడైనా భుజాన వేసుకున్నారా? మనం ఎత్తుకున్నప్పుడల్లా అవమానపరిచిండ్రు. జైల్లో వేసిండ్రు. కాల్చి చంపిడ్రు. ఇలాంటి వాళ్లకు తెలంగాణ అంటే ప్రేమ ఉంటదా? ఈ ఢిల్లీ గులాములు కింద ఉండి మనం కూడా గులాములం అవుదామా? అని ప్రశ్నించారు. రాబోయే రోజుల్లో ప్రాంతీయ యుగమే రాబోతుంది. ఎక్కడి వాళ్లు అక్కడ ఉంటేనే రాష్ట్రాలు అభివృద్ధి చెందుతాయి. ప్రయోజనాలు బాగుంటాయి.

Latest News

More Articles