Tuesday, May 7, 2024

పువ్వాడ పువ్వులు కావాలా? తుమ్మల తుంపలు కావాలా?

spot_img

ఖమ్మం: ఖమ్మం బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి, మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ను ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రశంసలు కురిపించారు. వాడవాడలా పువ్వాడ అంటూ రోజు పేపర్లలో చూసేవాడినని చెప్పారు. ఆయన ఎప్పుడు ప్రజల్లో ఉండే నాయకుడని పేర్కొన్నారు. ఖమ్మం నగరాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దిన ఘనత పువ్వాడకే దక్కుతుందన్నారు. లకారం చెరువును పర్యాటక కేంద్రంగా తయారు చేశారని అభినందించారు. ఇవన్ని చిటికేస్తే జరిగిపోలే. మంత్రి పువ్వాడ అజయ్ పనిచేస్తే జరిగిందన్నారు. ఖమ్మంలో నిర్వహించిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ పాల్గొని మాట్లాడారు.

Also Read.. కాంగ్రెస్‌ పరిపాలనలో సింగరేణి నష్టాల్లో ఉండేది

తాను చూసిన ఖమ్మానికి, ఇప్పటి ఖమ్మానికి చాలా తేడా ఉందని, ఇదంగా అజయ్ మిషన్ కారణంగానే సాధ్యమైందన్నారు. ఖమ్మం ప్రజలకు పువ్వాడ లాంటి మంచి ఎమ్మెల్యేగా ఉన్నారని, మరోసారి ఆయనను ఆశీర్వదించాలని కోరారు. పువ్వాడను గెలిపించుకుంటే ఖమ్మం ప్రజలను పువ్వుల్లో పెట్టి చూసుకుంటాడని పేర్కొన్నారు. పువ్వాడ పువ్వులు కావాలా? లేక తుమ్మల తుంపలు కావాలా? ఖమ్మం అభివృద్ధి ఇలాగే కొనసాగాలంటే పువ్వాడ అజయ్ ని ఆశీర్వదించాలని సీఎం కేసీఆర్ కోరారు.

Also Read.. సీఎం కేసీఆర్‌ వాహనాన్ని తనిఖీ చేసిన ఎన్నికల అధికారులు

అజయ్ కుమార్ పని చేసి చేసి చూపించాడు.ప్రజల్లో కలిసి పోయి పని చేసాడు.ఖమ్మంలో 1592 కిలోమీటర్లు మేర డ్రైన్స్ కట్టాము. ఖమ్మం సుందరంగా తయారైంది. మంచి చెడు చూసి విచక్షణతో ఓటయ్యాలి.ఖమ్మంలో ఐటీ టవర్ ఏర్పాటు చేసినం. ఖమ్మంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఏర్పాటు చేసినం. ఆర్టీసీ కల్యాణ మండపం కట్టినం. 75 వేల ట్యాప్ కనెక్షన్లు ఇచ్చాము. 24 గంటల కరంట్ ను అందిస్తున్నాం. రూ.300 కోట్లతో రగునాధ పాలం మండలంలో అభివృద్ధి చేశారని సీఎం చెప్పారు.

Latest News

More Articles