Friday, May 10, 2024

లోన్ యాప్ వేధింపులకు డిగ్రీ విద్యార్థి సూసైడ్

spot_img

లోన్ యాప్ వేధింపులకు ఓ డిగ్రీ విద్యార్థి బలయ్యాడు. ఈ విషాద ఘటన పల్నాడు జిల్లాలోని ఈపూరు మండలం ఎర్రగుంట తండాలో జరిగింది. వడ్డీకి వడ్డీ పెరిగిపోవడం, ఇంటికి వచ్చి బెదిరించడంతో మానసికంగా కృంగిపోయిన ఆ విద్యార్థి చివరకు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గ్రామానికి చెందిన డిగ్రీ విద్యార్థి బాలస్వామి నాయక్ గత ఏడాది ఓ లోన్ యాప్ ద్వారా అప్పు తీసుకున్నాడు. వడ్డీకి వడ్డీ పెరిగిపోవడంతో బాలస్వామి అప్పు చెల్లించ లేకపోయాడు. దీంతో ఫైనాన్స్ సంస్థలు బాలస్వామి స్నేహితులకు ఫోన్లు చేసి వేధించాయి. ఇటీవల ఎర్రగుంట తండాలోని బాలస్వామి ఇంటికి వచ్చి ఫైనాన్స్ సంస్థ ప్రతినిధులు బెదిరించారు. దీంతో మానసికంగా కృంగిపోయిన బాలస్వామి గత జనవరి 26న ఇల్లు వదిలి వెళ్లిపోయాడు. శనివారం అతని మృతదేహం లభించింది. ఎర్రగుంట తండా సమీపంలోని అటవీ ప్రాంతంలో బాలస్వామి చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కొడుకు మృతితో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా రోదిస్తున్నారు.

Read Also: ‘పోకిరి’ సినిమా చూపిస్తూ బ్రెయిన్‌ సర్జరీ

Latest News

More Articles