Sunday, May 5, 2024

మార్కులు తక్కువగా వచ్చినా.. ఫెయిల్ అయినా అధైర్య పడవద్దు

spot_img

హైద‌రాబాద్ : విద్యార్థులు సూసైడ్ చేసుకోవడం బాధ అనిపించిందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి అన్నారు. తొందరపాటు నిర్ణయాలు తీసుకొని బంగారు భవిష్యత్తు నాశనం చేసుకోవద్దని విద్యార్థులకు సూచించారు. విపరీత నిర్ణయాలు తీసుకునేప్పుడు తల్లితండ్రుల కష్టం గుర్తు తెచ్చుకోవాలని సబితా కోరారు.

బషీర్‌బాగ్‌లోని ఎస్సీఈఆర్టీలో పదో తరగతి వార్షిక పరీక్షల ఫలితాలను విడుదల చేసిన మంత్రి సబిత.. అనంతరం మాట్లాడారు. మార్కులు తక్కువగా వచ్చినా, ఫెయిల్ అయినా అధైర్య పడవద్దని స్టూడెంట్స్ కు సూచించారు. వెంటనే సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహిస్తామని తెలిపారు.

రాష్ట్రంలో అన్ని గురుకులాలు అద్భుతమైన ఫలితాలు వచ్చాయన్న మంత్రి.. ముఖ్యమంత్రి ఏ ఆశయంతో అయితే వాటిని ఏర్పాటు చేశారో.. ఆ ఆశయాలకు అనుగుణంగా విద్యార్థులు ప్రతిభ చాటారన్నారు.  గురుకులాల తరఫున ముఖ్యమంత్రి కేసీఆర్ కు కృతజ్ఞతలను మంత్రి సబిత తెలియజేశారు.

Latest News

More Articles