Saturday, April 27, 2024

ప్రేమికుడి కోసం ఇండియా వచ్చిన ఇరాన్ ప్రియురాలు

spot_img

ప్రపంచంలో ఎక్కడెక్కడో ఉన్న ప్రేమికులను సోషల్ మీడియా ఒకటిగా కలుపుతోంది. ఆ మధ్య పాకిస్తాన్ కు చెందిన సీమా హైదర్, నోయిడాకు చెందిన సచిన్ మీనాల మధ్య ప్రేమ చిగురించడానికి సోషల్ మీడియానే కారణమైంది. తాజాగా ఇదే సోషల్ మీడియా ఇరాన్ అమ్మాయినీ, ఉత్తరప్రదేశ్ అబ్బాయిని ఒక్కటి చేసింది.

ఇరాన్ కు చెందిన 20 ఏళ్ల ఫైజా అనే అమ్మాయి, మొరాదాబాద్ కు చెందిన దివాకర్ కుమార్ మధ్య సోషల్ మీడియా వేదికగా ప్రేమ చిగురించింది. దివాకర్ ఒక టూరిస్ట్ వ్లాగర్. చూడతగిన ప్రదేశాల గురించి వివరిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ ఉంటాడు. ఇరాన్ లోని హమెడాన్ సిటీకి చెందిన ఫైజా అక్కడే ఓ యూనివర్శిటీలో చదువుకుంటోంది. ఆమెకు దివాకర్ పోస్టులంటే ఎంతో ఇష్టం. దివాకర్ పెట్టే పోస్టులను ఆమె మరొక సైట్ లోరీపోస్ట్ చేస్తూ ఉంటుంది. ఈ క్రమంలో ఇద్దరి మధ్య ప్రేమ మొదలైంది. మూడేళ్లుగా సాగుతున్న తమ ప్రేమాయణానికి వివాహంతో ఫుల్ స్టాప్ పెట్టాలనుకున్నారు. అంతే….ఫైజా తన తండ్రిని తీసుకుని మొరాదాబాద్ వచ్చేసింది.

ఇది కూడా చదవండి:వంద రోజుల పాలనలో దందాలు తప్పా ప్రజలకు ఒరిగిందేమీ లేదు

ఫైజాను కలిసేందుకు గతేడాది జూలైలో ఇరాన్ వెళ్లానని తెలిపాడు దివాకర్. ఆ సమయంలో నేను పర్షియన్ నేర్చుకుంటే, ఫైజా హిందీ నేర్చుకుంది. కాబట్టి మా మధ్య కమ్యూనికేషన్ కు ఇబ్బందేమీ లేదు. ఫైజా కుటుంబం వాల్ నట్ వ్యవసాయం చేస్తుంది. మా రెండు కుటుంబాలకూ మా పెళ్లి పట్ల అభ్యంతరాలేమీ లేవు. ప్రస్తుతం మొరాదాబాద్ లో ఉన్న ఫైజాకు తాజ్ మహల్, అయోధ్యలోని రామ్ మందరం చూడాలని ఉంది. త్వరలోనే వాళ్లని అక్కడికి తీసుకువెళ్తానని తెలిపాడు దివాకర్.

 

Latest News

More Articles