Friday, May 10, 2024

రైతన్న కడుపు మంట..ఎండిన వరికి పొలానికి నిప్పు.!

spot_img

ఆరుగాలం శ్రమిస్తేనే..చివరికి పెట్టుబడి కూడా మిగలని పరిస్థితి. పొలం పండించేందుకు లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టి..చేతికి వస్తుందన్న పంట సాగునీరు లేక ఎండిపోతే..ఆ రైతు కష్టాన్ని మాటల్లో చెప్పలేము. రాష్ట్రంలో చాలా ప్రాంతాల్లో చేతికందాల్సిన పంటలు ఎండిపోతున్నాయి. కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత రైతన్నలకు కరువు దాపురించింది. రైతులను ఆదుకోవలసిన సర్కార్ చేతులెత్తయ్యడంతో..కడుపు మండిన రైతన్నలు తమ పొలాలకు నిప్పు పెడుతున్నారు. ఏం చేయాలో..ఎవరికి చెప్పుకోవాలో అర్థం తమలో తామే కుమిలిపోతున్నారు. ఉద్యమ పార్టీ హయాంలో పచ్చని పొలాలు చూసిన రైతన్నలు..ఇప్పుడు ఎండిన పొలాలను చూసి కన్నీరు మున్నీరవుతున్నారు.

తాజాగా నల్లగొండ జిల్లా మిర్యాలగూడ మండలం యాద్గార్ పల్లి గ్రామానికి చెందిన రైతు మల్లెబోయిన సైతులు ఐదు ఎకరాల్లో వరిని సాగు చేశాడు. నాగార్జున సాగర్ ఎడమ కాల్వ ఆయకట్టు పరధిలో ముల్కలకాల్వ మేజర్ కాల్వ కింద బోరునీటి ఆధారంతో వరి సాగు చేస్తున్నాడు. పంట పొట్ట దశకు వచ్చే వరకు నీరు బాగానే పారింది. పొట్ట దశలో బోర్లలో నీరు లేకపోవడంతో పొలం పూర్తిగా ఎండిపోయింది. దీంతో సైదులు ఆదివారం పంటకు నిప్పు పెట్టాడు. ఈ మధ్యే ఖమ్మం జిల్లాకు నీరు వదిలిన మేజర్ కాల్వలకు నీరు వదిలి ఉంటే పంట చేతికి వచ్చేదని రైతు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ఐదు ఎకరాల పొలం సాగుకు రూ. 1.25లక్షల పెట్టుబడి పెట్టినట్లు తెలిపారు. పదిహేను రోజులపాటు నీరు పారినట్లయితే పంట చేతికి వచ్చేదని, కాంగ్రెస్ సర్కార్ సాగర్ కాల్వకు నీరు వదలకపోవడంతో తీవ్రంగా నష్టపోయినట్లు తెలిపాడు. ప్రభుత్వం తనను ఆదుకోవాలని సైదులు కోరుతున్నాడు.

ఇది కూడా చదవండి: నేటి నుంచి టెన్త్ పరీక్షలు..5 నిమిషాలు ఆలస్యమైనా ఓకే..!

Latest News

More Articles