Saturday, May 4, 2024

మున్సిపల్ కార్మికులను సన్మానించిన హరీష్ రావు

spot_img

సిద్దిపేట జిల్లా: సిద్దిపేట ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో స్వచ్ఛ సర్వేక్షణ్ లో దక్షణ భారత దేశంలోనే సిద్దిపేటకు క్లిన్ సిటీ అవార్డ్ వచ్చిన నేపథ్యంలో మున్సిపల్ కార్మికులను మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు సన్మానించారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ.. క్లినెస్ట్ సిటీ ఆఫ్ తెలంగాణ అండ్ సౌత్ ఇండియాగా సిద్దిపేట అవార్డు (చెత్త సేకరణలో సమర్థవంతంగా నిర్వహణ) సాధించడం మనందరికీ గర్వకారణం అన్నారు. ఇందుకు కృషి చేసిన మున్సిపాలిటీ, కౌన్సిలర్లు , అధికారులను ఆయన అభినందించారు.

Also Read.. శ్రీవారి దర్శనానికి డైరెక్ట్‌ లైన్‌

పారిశుధ్య కార్మికులు.. సామాజిక వైద్యులు. శుద్ధిపేట స్ఫూర్తి నిరంతరం కొనసాగాలన్నారు.  ఈ అవార్డు సిద్దిపేట ప్రజలకు అంకితం అన్నారు. ప్రజల భాగస్వామ్యం లేనిది, అనుకున్న లక్ష్యం నెరవేరడం సాధ్యం కాదన్నారు. సిద్దిపేట వారి సొంత ఇంటిగా భావించి, శుద్దిపేటగా నిలబెట్టారని అభినందించారు. వైద్యులు రోగాలు వచ్చిన తర్వాత చికిత్స అందిస్తే, కార్మికులు రోగాలు రాకుండా కాపాడుతున్న సామాజిక వైద్యులని ప్రశంసించారు.

Also Read.. ఇంటి ముందు ముగ్గులు వేస్తున్న అక్కాచెల్లెళ్లపైకి దూసుకొచ్చిన లారీ.. చెల్లి మృతి

2023లో దేశంలో 4416 మున్సిపాల్టీలో 9వ స్థానంలో హైదరాబాద్ నిలిస్తే.. మన దక్షిణ భారత దేశంలో సిద్దిపేట తొలిస్థానంలో నిలిచింది. కానీ రాష్ట్ర ప్రభుత్వం తరుపున అభినందన ట్వీట్, ప్రెస్ నోట్ కూడా నోచుకోలేని దుస్థితిలో ఉన్నామని ఆవేదన వ్యక్తం చేశారు.

Latest News

More Articles