Sunday, May 5, 2024

కాంగ్రెస్ కు ఓట్లు వేస్తే మెదక్, సిద్దిపేట కొత్త జిల్లాలు పోతాయి

spot_img

బీఅర్ఎస్ పార్టీ కార్యకర్తలు గట్టిగా పని చేస్తున్నారు. 25 ఏండ్లు గా మెదక్ లో బీఅర్ ఎస్ గెలుస్తూవస్తుంది. కేసీఆర్ వల్లనే రేవంత్ రెడ్డి మెదక్ కు వచ్చాడు. కేసీఆర్ మేదక్ జిల్లా కేంద్రం చేయడం వల్లనే మెదక్ పట్టణంకు వచ్చావని తెలిపారు మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మేల్యే హరీశ్ రావు తెలిపారు. మెదక్ పట్టణంలో బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి కి మద్దతుగా ధ్యాన్ చంద్ చౌరస్తా నుంచి రాందాస్ చౌరస్తా వరకు జరుగుతున్న ర్యాలీ లో పాల్గొని మాట్లాడారు  హరీష్ రావు…

రేవంత్ పచ్చి అబద్ధాలు చెప్పాడు. రేవంత్ రెడ్డికి స్క్రిప్ట్ రైటర్ కుడా సరిగా లేదు. మంజీరా, హల్ది పై చెక్ డ్యాంలు కట్టి సాగు నీరు ఇచ్చాము. మెదక్ కు రైల్వే లైన్ తెచ్చాం. తెలంగాన ప్రజలు కాంగ్రెస్ ను నమ్మరు. ఆరు హామీలు నెరవేర్చ లేదు. చేయని పనులు చేసినట్టు జూటా మాటలు మాట్లాడుతున్నాడు. కాంగ్రెస్ వచ్చాక 280 మంది రైతులు ఆత్మ హత్యలు చేసుకున్నారు. ప్రజల గురించి పట్టించుకునే ధ్యాస రేవంత్ రెడ్డికి లేదు. రఘునందన్ రావు మాటలు నమ్మితే నీళ్ళు లేని బావి లో దూకినట్టే. బీజేపీ పార్టీ మతాన్ని అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేస్తున్నారు. బీజేపీ పాలన లో అన్ని ధరలు పెరిగాయి. బీజేపీ పాలనలో ప్రజలకు చేసింది ఏమీలేదన్నారు హరీశ్ రావు.

రేవంత్ రేపు గన్ పార్కు దగ్గరికి రా..రేపు ఆరు హామీలు అమలు చేస్తానని మాట ఇవ్వు. నేను రాజీనామా చేస్తాను….హామీలు అమలు చేయలేక పోతే నువ్వు రాజీనామా చేయి అని డిమాండ్ చేశారు హరీశ్ రావు. కాంగ్రెస్ నాయకులు భూమి మీద లేరు. జిల్లాలను తీసివేయాలని చూస్తున్నారు. కాంగ్రెస్ ఓట్లు వేస్తే మెదక్, సిద్దిపేట కొత్త జిల్లాలు పోతాయి. వెంకట్రామి రెడ్డి మంచి వాడు, సేవ  భావం కల్గిన విద్యావంతుడు. మెదక్ ప్రాంత అభివృద్ధి కోసం వెంకట్రామి రెడ్డి ని గెలిపించండి. ప్రజలు కాంగ్రెస్ పార్టీకి గుణపాఠం చెప్పాలని చూస్తున్నారు. ప్రతి కార్యకర్త కాంగ్రెస్ పార్టీ చేసిన మోసాలను ఇంటి ఇంటింటికి వెళ్లి చెప్పాలన్నారు.

కేసీఆర్ బస్ యాత్ర తో మార్పు మొదలయింది.బీఅర్ఎస్ పార్టీకి 8 నుండి 9 సీట్లు వస్తాయి. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కేసీఆర్ బస్ యాత్ర ను చూసి గజ గజ వణుకుతున్నారన్నారు హరీశ్ రావు.

మెదక్ జిల్లా లో కలెక్టరు గా సేవ చేసే అవకాశం లభించింది. కలెక్టర్ గా ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా పనిచేశానని తెలిపారు బీఆర్ఎస్ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి. మెదక్ ప్రజలకు అందుబాటులో ఉండి.. ఈ ప్రాంత అభివృద్ధి కోసం కృషి చేస్తాను. నా పరిపాలన అనుభవంతో మెదక్ నియోజక వర్గ అభివృద్ధి కోసం నిధులు తీసుకువస్తాను. నిరుపేదల విద్య కోసం ట్రస్ట్ ద్వారా వంద కోట్ల  ఇస్తాను. యువత కోసం కోచింగ్ సెంటర్లు ఏర్పాటు చేస్తాను. నాపై విశ్వాసం ఉంచి గెలిపించండి పార్లమెంట్ వేదికగా మెదక్ అభివృద్ధి కోసం పోరాడుతానని తెలిపారు వెంకట్రామిరెడ్డి.

ఇది కూడా చదవండి: హైదరాబాద్ మెట్రో రైల్వే ఎండీకి హైకోర్టు నోటీసులు

 

Latest News

More Articles