Sunday, May 5, 2024

వంద రోజుల పాలన: 3 విచారణలు, 6 వేధింపులు అన్నట్లు కాంగ్రెస్ పాలన సాగింది

spot_img

ఎన్నికలలో హామీల అమలులో కాంగ్రెస్ పూర్తిగా విఫలం అయ్యిందన్నారు మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు. వంద రోజుల పాలనలో కాంగ్రెస్ ప్రజల్ని దారుణంగా మోసం చేసిందన్నారు. మూడు విచారణలు, ఆరు వేధింపులు అన్నట్లు కాంగ్రెస్ పాలన సాగిందని విమర్శించారు.ఇవాళ(శుక్రవారం) తెలంగాణ భవన్ లో జరిగిన ప్రెస్ మీట్ లో మాట్లాడిన ఆయన…మొదటి సంతకం రుణమాఫీ అని మాట తప్పారు. కుర్చీ ఎక్కడం మాత్రం రెండు రోజుల ముందు జరుపుకున్నారు. గ్యారంటీలకు మొదటి క్యాబినెట్ లోనే చట్టబద్ధత తెస్తామని మాట తప్పారు. ప్రజా దర్బార్ అని చేయి ఇచ్చారు. ప్రగతి భవన్ ను కూల్చుతాం నాలెడ్జ్ సెంటర్ ఏర్పాటు చేస్తామన్నారు. ఈరోజు ఉప ముఖ్యమంత్రి అందులో ఉంటున్నారు. అసెంబ్లీ స్వరూపాన్ని మార్చేస్తా అన్నారు. ఇప్పటివరకు తట్టడం మట్టి కూడా తవ్వలేదు. రైతు భరోసా అన్నారు. మేమిచ్చే రైతు బందును ఇప్పటివరకు పూర్తి చేయలేదు. రుణమాఫీ పై అతీగతీ లేదు ఒక్క అడుగు ముందుకు పడలేదు. ఆసరా పింఛన్లు పెంచుతామన్నారు ఉన్న పింఛన్లు సరిగా ఇవ్వడం లేదు. కేసీఆర్ తెలంగాణ పరువు పెంచే ప్రయత్నం చేస్తే, రేవంత్ రెడ్డి కరువు పెంచేందుకు పోటీపడుతున్నారు. దేశమంతా కరువు ఉందని మాటలు చెబుతూ రైతుల నోట్లో మట్టి కొడుతున్నారు. కేసీఆర్ పాలనలో పచ్చని పొలాలు కనిపిస్తే 10 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ పాలనలో పంటలకు మంటలు పెట్టే పరిస్థితి వచ్చింది. కేసీఆర్ వ్యవసాయాన్ని శిఖరాగ్రం లో నిలబెడితే రేవంత్ రెడ్డి శిథిలావస్థకు చేర్చారన్నారు.

కేసీఆర్ హయాంలో తాగునీటికి సాగునీటికి లోటు లేని పరిస్థితి ఉంటే, రేవంత్ రెడ్డి పాలనలో కన్నీళ్ళకు కొరతలేని పరిస్థితి ఏర్పడిందన్నారు హరీశ్ రావు. మిషన్ భగీరథతో ఇంటింటికి నీళ్లు మేము తెస్తే రేవంత్ రెడ్డి పాలనలో ఖాళీ బిందెల ప్రదర్శన కనిపిస్తోంది. ఆయన నియోజకవర్గం కొడంగల్ లోనే కనిపిస్తున్నది. ఖమ్మం పట్టణంలో ప్రతి మూడు రోజులకు ఒకసారి నల్ల వస్తోందట. కర్ణాటక నుండి తాగునీరు తేవడంలో రేవంత్ పూర్తిగా వైఫల్యం పొందారు. కృష్ణ బోర్డుకు ప్రాజెక్టులు వచ్చి రాగానే అప్పజెప్పే ప్రయత్నం చేశారు.బీఆర్ఎస్ పార్టీ పోరాటం చేస్తే మళ్లీ తోక ముడిచి అసెంబ్లీలో చేయబోమని ప్రకటన చేశారు. వంద రోజుల్లో గొల్ల కురుమలకు గొర్రెలు ఇస్తామని మాట చెప్పారు. ఒక్కరికి ఇప్పటివరకు ఇవ్వలేదు.కేసీఆర్ కిట్లు ఇస్తే.. రేవంత్ రెడ్డి తిట్లతో రాష్ట్రాన్ని కలుషితం చేస్తున్నారు. వంద రోజుల్లో మీరు సాధించింది ఏమైనా ఉందా అంటే పదిసార్లు ఢిల్లీ వెళ్లొచ్చారు. తెలంగాణ ఆత్మగౌరవాన్ని ఢిల్లీలో తాకట్టు పెట్టారు. రైతుబంధు పడలేదంటే చెప్పుతో కొట్టాలంటారు. కేసీఆర్ రు అనారోగ్యంపై దిగజారుడు వ్యాఖ్యలు చేశారు. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ బీజేపీ కుమ్మక్కు అయిందని మొన్నటి బడేబాయ్ వ్యాఖ్యలతో అర్థమైంది. బడే బాయ్ చోటే బాయ్ బంధం బయట పడిందన్నారు హరీశ్ రావు. దేశంలో బద్ద విరోధులమని చెబుతారు.. తెలంగాణలో మాత్రం బలమైన బంధంగా ఉంటారు. పార్టీ మారితే రాళ్లతో కొట్టాలని అన్నారు రేవంత్ రెడ్డి. ఈరోజు బీజేపి నాయకుల ఇంట్లోకి వెళ్తున్నాడు.

ఫార్మాసిటీ రద్దు అన్నారు.. మాట మార్చారు.. మెట్రో రైలు వద్దు అన్నారు. మాట మార్చారు..అనేక విషయాల్లో యూ టర్న్ తీసుకున్నారు. యూటర్న్ యూట్యూబ్ పాలన కనిపిస్తోందన్నారు మాజీ మంత్రి హరీశ్ రావు. వంద రోజుల్లో హామీలు అమలు చేస్తానని మాట తప్పాడు రేవంత్. గేట్లెత్తితే మీ పార్టీలో ఒక్కరు మిగలడని రేవంత్ రెడ్డి అంటాడు. పార్టీల గేట్లు కాదు ప్రాజెక్టుల గేట్లు ఎత్తి పంటలకు నీళ్లు ఇవ్వండి. పొలాలకు నీళ్లు ఇచ్చి పంటలు కాపాడే ప్రయత్నం చేయండి. తెలంగాణ రైతులు అనేక కష్టాల్లో ఉన్నారు. గొర్లు మేకలు పశువులు పంటలు మేస్తున్నాయి ట్యాంకర్లతో పొలాలకు నీళ్లు అందిస్తున్నారు. హైదరాబాదులో టాంకర్లతో నీటి సరఫరా ఇప్పుడే మొదలైంది. కేసీఆర్ హయాంలో ఖాళీ బిందెలు, ట్యాంకర్లు కనిపించాయా అని ప్రశ్నించారు.

వంద రోజుల కాంగ్రెస్ పాలనలో 174 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు అని అన్నారు హరీశ్ రావు. 38 మంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్యలు చేసుకున్నారు.చేనేత కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు.ఉమ్మడి పాలనలోని దుర్భర పరిస్థితిలను నేటి కాంగ్రెస్ ప్రభుత్వం గుర్తు చేస్తున్నది. కాంగ్రెస్ వచ్చింది కరువు వచ్చింది. రైతు ఆత్మహత్యలు జరుగుతున్నాయి. ఆటో కార్మికుల ఆత్మహత్యలు జరుగుతున్నాయి. నేతలను ఆత్మహత్యలు జరుగుతున్నాయి.ఆర్ గ్యారంటీలో మొదటి హామీ అమలు చేయలేదు.. చివరి హామీ అమలు చేయలేదు. ఏం ముఖం పెట్టుకొని పార్లమెంటు ఎన్నికల్లో ఓట్లు అడుగుతారు. రైతుల విషయంలో ఒక్క హామీ కూడా అమలు చేయలేదు. కౌలు రైతులకు ఎకరానికి 15000 అన్నారు వ్యవసాయకులకు 12,000 అన్నారు వరి పంటకు 500 బోనస్ అన్నారు. ఇవన్నీ మోసం దగా అన్యాయం. ఇది కాలం తెచ్చిన కరువు కాదు కాంగ్రెస్ తెచ్చిన కరువు అని ఆరోపించారు హరీశ్ రావు.

ఇది కూడా చదవండి:  ఏనుగు పార్టీకి రెండు ఎంపీ స్థానాలు కేటాయించిన కేసీఆర్

Latest News

More Articles