Sunday, May 5, 2024

కాలయాపన కోసమే ప్రజాపాలన దరఖాస్తుల స్వీకరణ

spot_img

ప్రజాపాలన అంటూ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను ఆగం చేస్తోందని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. జగిత్యాల జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఆయన ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు కల్వకుంట్ల విద్యాసాగర్ రావ్, జగిత్యాల, కోరుట్ల ఎమ్మెల్యేలు డా.సంజయ్ కుమార్, డా.కల్వకుంట్ల సంజయ్, చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకె రవి శంకర్, జడ్పీ చైర్ పర్సన్ వసంత, మాజీ మార్క్ ఫెడ్ చైర్మన్ లోక బాపు రెడ్డి, జడ్పీ వైస్ చైర్మన్ హరి చరణ్ రావ్ తదితరులు పాల్గొన్నారు.

Read Also: కాలేజ్ వాచ్‎మెన్‎తో పారిపోయిన ఇంటర్ విద్యార్థిని

ఈ సందర్భంగా కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ.. ‘కాంగ్రెస్ ఇచ్చిన హామీలకై ప్రజలు ఎదురు చూస్తున్నారు. 10 ఏండ్లలో ఎవర్నీ ఇబ్బందిపెట్టకుండా అభివృద్ధి చేసింది కేసీఆర్ సర్కారు. రైతులు నీటికోసం ఎదురుచూస్తున్నారు. రైతు బంధు ,రైతు సంక్షేమంపై రేవంత్, భట్టి, ఉత్తమ్ విభిన్న వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇచ్చిన వాగ్దానాలు తప్పించునే యత్నంలో కాంగ్రెస్ సర్కారు ఉంది. కాళేశ్వరం ప్రాజెక్ట్ పై ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి వ్యాఖ్యలు అర్ధరహితం. ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కాళేశ్వరం. పంటలను కాపాడేందుకు చర్యలు తీసుకోవాలసింది పోయి మంత్రులు మేడిగడ్డ పర్యటనలు చేస్తున్నారు. ప్రాజెక్ట్‎లపై విజిలెన్స్ కమిటీ ఎందుకు వేయలేదు. పథకాల అమలుకు ఇంటింటి సర్వే ఎందుకు? మళ్ళీ దరఖాస్తులు ఎందుకు? కాలయాపన కోసమే దరఖాస్తుల స్వీకరణ. బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులపై అక్రమ కేసులు బనాయిస్తున్నారు. ప్రతి బీఆర్ఎస్ కార్యకర్తకు అండగా ఉంటాం. ఏ ఒక్కరిపై అక్రమ కేసు బనాయించినా ఎదుర్కొని పోరాడుతాం’ అని కొప్పుల ఈశ్వర్ అన్నారు.

జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు విద్యాసాగర్ రావు
ప్రజాపాలన అంటూ ప్రజలను కాంగ్రెస్ ప్రభుత్వం ఆగం చేస్తోంది. తప్పుడు వాగ్దానాలతో ప్రజలను మోసం చేస్తున్నారు. బీఆర్ఎస్ ఎంపీటీసీలు, సర్పంచ్‎లు, కౌన్సిలర్లపై కాంగ్రెస్ బెదిరింపులకు పాల్పడుతోంది. లా అండ్ ఆర్డర్ కాపాడాలని ఎస్పీకి వినతి పత్రం ఇచ్చాం.

Latest News

More Articles