Thursday, May 2, 2024

బీటలు వారిన వరిపంట.. మళ్లీ బావులు తవ్వే పరిస్థితి ఏర్పడింది

spot_img

కరీంనగర్ జిల్లా : గంగధర మండలంలో చొప్పదండి నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పర్యటించారు. ఈ సందర్భంగా నీరులేక ఎండిపోయి బీటలు వారిన వరిపంట రైతులను ఓదార్చారు. నారాయణ పూర్ రిజర్వాయర్ నుంచి నీటిని విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

రైతులకు వెన్నుదన్నుగా నిలవాల్సిన ప్రభుత్వం రైతు ఆత్మహత్య లను పురిగొల్పేలా చేస్తుందని మండిపడ్డారు. మండలం కురుమ పల్లి గ్రామంలో సకాలంలో నీటిని విడుదల చేయకపోవడంతో పచ్చగా కలకలలాడే వరిపంటకి నీరులేక బీటలువారిందన్నారు.

రైతుల పొలాల్లోకి వెళ్లి  ఎండిన వరిపంటను చూసి ఆయన చలించిపోయారు. కేసీఆర్ ప్రభుత్వంలో ఏనాడూ నీటి కొరత రాకుండా రైతులకు ఉచిత విద్యుత్ తోపాటు రైతులకు సరిపడా నీళ్ళను అందించామన్నారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు తర్వాత మళ్ళీ ఎన్నడు చూడబోమని అనుకున్న క్రేన్ లతో బావులు తవ్వే పరిస్థితి ఏర్పడిందని రవిశంకర్ అన్నారు.

ఇది కూడా చదవండి: 10 సీట్లు వచ్చినప్పుడే భయపడలే.. ఇప్పుడైతే ఒక్కొక్కడిని వణికిస్తాం

Latest News

More Articles