Monday, May 6, 2024

మహిళలకు గుడ్ న్యూస్.. భారీగా దిగొచ్చిన బంగారం.. ఎంతంటే.!

spot_img

బంగారం ధరలు తగ్గాయి. రోజుకొక రికార్డు స్థాయిలో దూసుకుపోయిన ధరలు ప్రస్తుతం తగ్గుతూ వస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో అతివిలువైన లోహాల ధరలు తగ్గుముఖం పట్టడం,ట్రేడర్లు,ప్రాఫిట్ బుకింగ్ కు మొగ్గుచూపడంతో ధరలు ఒక్కసారిగా భారీగా పడిపోయాయి. ఢిల్లీ బులియన్ మార్కెట్లో మంగళవారం ఒకేరోజు తలుం బంగారం ధర రూ. 1,450 తగ్గింది. బులియన్ మార్కెట్ సమయం ముగిసే సరికి బంగారం ధరరూ. 72,000కి దిగొచ్చింది. అంతకుముందు రోజు ధర రూ. 73,650గా ఉంది. ఇటు హైదరాబాద్ లోనూ 24 క్యారెట్ల స్వచ్చమైన బంగారం తులం బంగారం ధరరూ. 1,530కి తగ్గి రూ. 72,160కి చేరుకుంది. గతంలో ఇది రూ. 73,690గా నమోదు అయ్యింది. అలాగే రూ. 1,400తగ్గిన 22 క్యారెట్ల బంగారం ధర రూ. 66,150కి చేరుకుంది.

అటు వెండి కూడా భారీగా తగ్గింది. పారిశ్రామికవర్గాలు, నాణేల తయారీదారుల నుంచి కొనుగోళ్లు నిలిచిపోవడంతో వెండి ధరలు తగ్గాయి. కిలో వెండి ఏకంగా రూ. 2,300వరకు దిగొచ్చింది. రూ. 85,800 నుంచి 85,500కి తగ్గింది. హైదరాబాద్ లో కిలో వెండి రూ. 2,500తగ్గి రూ. 86,500గా నమోదు అయ్యింది. అంతకుముందు ఇది రూ. 89వేలుగా ఉంది. మరోవైపు అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ బంగారం ధర ఒకేరోజు 55 డాలర్లు పడిపోయింది. కోమెక్స్ లో స్పాట్ గోల్డ్ ధర 2,310 డాలర్ల వద్ద కొనసాగుతోంది. మంగళవారం కూడా ధరలు భారీగా తగ్గాయి.

ఇది కూడా చదవండి: ఎన్నికలు ఎప్పుడొచ్చినా…అధికారం మాదే: కేసీఆర్

Latest News

More Articles