Sunday, May 5, 2024

మహిళలకు శుభవార్త..భారీగా తగ్గుతున్న బంగారం ధర.!

spot_img

పసిడి ప్రియులకు ఊరటనిచ్చే వార్త.బంగారం, వెండి ధరలు దిగొస్తున్నాయి. గత నెల రోజుల్లో భారీగా పెరిగి రికార్డులు క్రియేట్ చేసిన బంగారం ధరలు ఇప్పుడు భారీగా తగ్గుతున్నాయి. గత వారం రోజులుగా తగ్గుతూ వస్తున్నాయి. దీంతో బంగారం కొనాలనుకునేవారికి కాస్త ఊరట లభించినట్లేనని చెప్పవచ్చు. అయినప్పటికీ ఇప్పటికీ రేటు భారీగానే ఉంది. గత నెల రోజుల్లో వరుసగా రోజుకు రూ. 1000వరకు పెరుగుతూ పోయింది. ఇంకా చాలా రోజులు పడితే కానీ మునపటి స్థాయికి బంగారం ధరలు వచ్చేలా లేవు. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో ఇదిసాధ్యమేనా అనే వాదన కూడా వినిపిస్తోంది. అంతర్జాతీయంగా అనిశ్చిత పరిస్థితులే బంగారం ధరల పెరుగుదలకు కారణం అని నిపుణులు చెబుతున్నారు. ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య యుద్ధం ఒకవైపు అమెరికా ఫెడ్ వడ్డీ రేట్లపై ప్రకటనలు మరోవైపు బంగారం ధరల ర్యాలీకి కారణం అవుతున్నాయి.

ప్రస్తుతం ఇంటర్నేషనల్ మార్కెట్లో స్పాట్ బంగారం ధర ఔన్సుకు 2330 డాలర్ల వద్ద స్ధిరంగా కొనసాగుతోంది. స్పాట్ సిల్వర్ రేటు 27.38 డాలర్ల వద్దు ట్రేడ్ అవుతోంది. ఇక డాలర్ తో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ. 83.30 దగ్గర ఉంది. అంతర్జాతీయ మార్కెట్లో ధరలు స్థిరంగా కనిపిస్తున్నా.. దేశీయంగా నేడు బంగారం, వెండి రేట్లు తగ్గాయి. హైదరాబాద్ లో ఇప్పుడు 22 క్యారెట్ల బంగారం రేటు రూ. 350 పడిపోయింది. ప్రస్తుతం తులానికి రూ. 66,250 వద్ద కొనసాగుతోంది. ఇక 24 క్యారెట్స్ బంగారం ధర రూ. 380 పతనంతో ప్రస్తుతం 10 గ్రాములకు రూ. 72,270 వద్దఉంది. కిందటి రోజు ఈ రేటు వరుసగా రూ. 450, రూ. 490 పెరిగింది. అంతకుముందు ఒక రోజులో రూ. 1400, రూ. 1530 వరకు తగ్గింది. ఏప్రిల్ 19న తులం గోల్డ్ రేటు 22 క్యారెట్లపై రూ. 68,150 వద్ద ఉంది. దాదాపు రూ. 1900 పతనంతో ప్రస్తుతం రూ. 66,250 గా ట్రేడ్ అవుతోంది.

ఇది కూడా చదవండి: అలా చేస్తే భారత్ లో వాట్సాప్ ఉండదు..మెటా వెల్లడి..!

Latest News

More Articles