Sunday, May 5, 2024

అలా చేస్తే భారత్ లో వాట్సాప్ ఉండదు..మెటా వెల్లడి..!

spot_img

గోప్యతను వదులుకుంటే వాట్సాప్ భారత్ నుంచి బయటకు వెళ్లిపోతుందని మెటా సంస్థ ఢిల్లీ హైకోర్టుకు వెళ్లడించింది. ఐటీ రూల్స్ 2021లోని 4(2)నిబంధనను సవాల్ చేస్తూ వాట్సాప్ యాజమాన్య సంస్థ మెటా హైకోర్టుకు ఆశ్రయించింది. ఏదైనా పోస్టు లేదా సమాచారం మొదట ఎవరి దగ్గరి నుంచి వచ్చిందనేది సోషల్ మీడియా సంస్థలు గుర్తించాలని ఈ నిబంధన చెబుతుంది. అయితే ఇలా చేయాలంటే కోట్లాది మెసేజ్ లను ఏళ్ల తరబడి స్టోర్ చేయాల్సి వస్తుందని వాట్సాప్ తరపున న్యాయవాది కోర్టుకు ముందుకు తీసుకువచ్చారు.

ఎండ్ టు ఎండ్ ఎంక్రిప్షన్ విధానానికి విఘాతం కలుగుతుందన్నారు. ఎండ్ టు ఎండ్ ఎన్ క్రిప్షన్ వల్ల గోప్యత ఉంటుందనే నమ్మకంతోనే యూజర్లు వాట్సాప్ వినియోగిస్తున్నారని దీనికి భంగం వాటిల్లే పరిస్థితి వస్తే తమ యూజర్ల నమ్మకం దెబ్బతింటుందని వివరించారు. నిబంధనల ప్రకారం, ఈ మెసేజింగ్ యాప్ చాట్‌లను ట్రేస్ చేయడానికి మరియు సమాచారం యొక్క అసలు మూలాన్ని గుర్తించడానికి నిబంధనలను రూపొందించాలని కోరింది.

ఇది కూడా చదవండి: వివేక్ నీ బట్టలూడదీసి కొడతా…బీజేపీ ఎంపీ అభ్యర్థి వార్నింగ్.!

Latest News

More Articles