Monday, May 6, 2024

వివేక్ నీ బట్టలూడదీసి కొడతా…బీజేపీ ఎంపీ అభ్యర్థి వార్నింగ్.!

spot_img

చెన్నూర్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామికి గట్టి వార్నింగ్ ఇచ్చారు పెద్దపల్లి బీజేపీ ఎంపీ అభ్యర్థి గొమాసె శ్రీనివాస్. వివేక్ వెంకటస్వామి కుటుంబం 30ఏండ్లుగా పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలను మోసం చేస్తుందని ఆరోపించారు. వారిది స్థానికేతరుల కుటుంబం అన్నారు. మీడియా సంస్థలను అడ్డం పెట్టుకుని అవాకులు, చెవాకులు పేల్చుతున్నారంటూ ఫైర్ అయ్యారు. ఇలాంటి విధానాలు మానుకోలేకపోతే వివేక్ ను బట్టలూడదీసి కొడతా అంటూ హెచ్చరించారు.

గురువారం ఆయన పెద్దపల్లిలో బీజేపీ అభ్యర్థిగా నామినేషన్ వేసి అనంతరం సిర్పూర్ కాగజ్ నగర్ఎమ్మెల్యే పాల్వాయి హారీశ్ బాబుతో కలిసి మాట్లాడారు.తనపై విమర్శలు చేస్తే ఊరుకునేలేదని స్పష్టం చేశారు.అనంతరం హరీశ్ బాబు మాట్లాడారు. రేవంత్ రెడ్డి ఆగస్టు 15వరకు రైతులకు రూ. 2లక్షల రుణమాఫీ చేస్తానని చెప్పారు. ఎక్కడికెళ్తే అక్కడి దేవుళ్లపై ఒట్టేస్తున్నారని..అలా కాకుండా తన కూతురుపై ఒట్టేసి చెప్పాలని డిమాండ్ చేశారు. రేవంత్ ఓటుకు నోటు కేసులో జులైలో జైలుకు వెళ్లే ఛాన్స్ ఉందన్నారు. అందుకే అభద్రతా భావంతో ఆగస్టు 15వరకు డెడ్ లైడ్ విధిస్తున్నారంటూ విమర్శించారు. బీజేపీ పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు చందుపట్ల సునీల్ రెడ్డి, నాయకుడు ప్రవీణ్ కుమార్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి: నిజామాబాద్ జిల్లాలో అర్థరాత్రి ఘోరరోడ్డు ప్రమాదం.!

Latest News

More Articles