Monday, May 6, 2024

ఆర్సీబీకి రెండో విజయం..35 పరుగుల తేడాతో హైదరాబాద్ ఓటమి.!

spot_img

ఉప్పల్ మైదానంలో హైదరాబాద్ తో జరిగిన పోరులో బెంగుళూరు రాయల్ ఛాలెంజర్స్ 35పరుగుల తేడాతో ఘనవిజయంసొంతం చేసుకుంది. ఆర్సీబీ తన 250వ ఐపీఎల్ మ్యాచులో చిరస్మరణీయ విజయాన్ని నమోదు చేసింది. దీంతో 6 వరుస మ్యాచుల తర్వాత బెంగుళూరుకు ఊరట లభించింది.

ఈ మ్యాచులో మొదటగా ఓపెనర్లుగా బరిలోకి దిగిన ట్రావిస్ హెడ్ ఒక్క పరుగు చేసి అభిమానులను నిరాశపరిచాడు. అభిషేక్ శర్మ 31 పరుగులు చేసి పర్వాలేదనిపించాడు. ఆ తర్వాత బ్యాంటింగ్ కు దిగిన మార్ర్కమ్ 7 పరుగులుచేశారు. ఫుట్ టాస్ బాల్ కు ఔట్ అయ్యాడు.తెలుగు ప్లేయర్ నితీష్ కుమార్ రెడ్డి 13, క్లాసెస్ 7 పరుగులు చేసి పెవిలియన్ బాటపట్టారు.

అనంతరం క్రీజులోకి వచ్చిన షాబాజ్ అహ్మద్ చివరి వరకు ఉండి బాగానే పోరాటం చేశాడు. అబ్దుల్ సమద్ 10, చివర్లో ప్యాట్ కమిన్స్ 31 పరుగులు చేసి మ్యాచ్ పై కాస్త ఆశలు తీసుకువచ్చారు. భువనేశ్వర్ 13, ఉనద్కత్ 8 పరుగులు చేశారు. బెంగుళూరు బౌలర్లలో స్పప్నిల్ సింగ్ 2,కర్ణ్ వర్మ 2, గ్రీన్ 2, జాక్స్ 1, దయాల్ 1 వికెట్ తీసుకున్నారు. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన బెంగుళూరుకు శుభారంభం దక్కింది. ఆ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 206 పరుగులను సాధించింది. ఆర్సీబీ బ్యాటింగ్ లో ఓపెనర్లు విరాట్ కోహ్లీ హాఫ్ సెంచరీతో రాణించారు. డుప్లెసిస్ 25 పరుగులు చేశాడు. ఆ తర్వాత విల్ జాక్స్ 6 పరుగులు చేసి తొందర్లోనే పెవిలియన్ బాట పట్టాడు ఆ తర్వాత రజత్ పాటిదార్ హాఫ్ సెంచరీతో రాణించాడు.

ఇది కూడా చదవండి:షిరిడీకి IRCTC అదిరిపోయే ప్యాకేజ్..పూర్తి వివరాలివే.!

Latest News

More Articles