Sunday, May 5, 2024

షిరిడీకి IRCTC అదిరిపోయే ప్యాకేజ్..పూర్తి వివరాలివే.!

spot_img

వేసవి సెలవులు రాగానే చాలా మంది పుణ్యక్షేత్రాలకు ప్లాన్ చేస్తుంటారు.పిల్లలతోపాటు పెద్దలు కలిసి విహారయాత్రలకు , ఆధ్యాత్మిక క్షేత్రాలను దర్శించుకునేందుకు వెళ్తుంటారు. అలాంటి వారికోసమే ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) ఓ ప్యాకేజీని అందిస్తోంది. షిరిడీతోపాటు త్రయంబకేశ్వర ఆలయ సందర్శనకు సదుపాయం కల్పిస్తోంది. టికెట్లు, బస ఏర్పాట్లతో ఈ ట్రిప్ ను తీసుకువచ్చింది. తక్కువ సమయంలో ఏదైనా ఆధ్యాత్మిక యాత్ర పూర్తి చేయాలనుకునేవారు దీనిని ఓ సారి పరిశీలించవచ్చు.

షిరిడీ విత్ జ్యోతిర్లింగం పేరుతో ఐటీఆర్ సీటీసీ ఈ టూర్ ప్యాకేజీని అందిస్తుంది. సికింద్రాబాద్ నుంచి ప్రారంభమై త్రయంబకేశ్వరం, పంచవటి, షిరిడీ సందర్శన అనంతరం తిరిగి సికింద్రాబాద్ చేరుకోవడంతో ఈ యాత్ర పూర్తవుతుంది. ఈ ట్రిప్ మొత్తం మూడు రాత్రులు, నాలుగు పగళ్లు ఉంటుంది. మే 7,14,21,28 తేదీల్లో ప్రయాణ టికెట్లు అందుబాటులో ఉంటాయి.

యాత్ర ఇలా కొనసాగుతుంది:
-తొలిరోజు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ సాయంత్రం 4.10 గంటలకు రైలు నెంబర్ 17208 బయలుదేరుతుంది.

– మర్నాడు ఉదయం 6.15కు నాగర్ సోల్ చేరకుంటుంది. అక్కడి నుంచి షిరిడీలో ముందుగా బుక్ చేసిన హోటల్ కు తీసుకెళ్తారు. బ్రేక్ ఫాస్ట్ చేసిన తర్వాత నాసిక్ ను సందర్శిస్తారు. సాయంత్రం తిరిగి షిరిడీ చేరుకుని అక్కడే బస చేస్తారు.

-మూడోరోజు ఉదయం అల్పాహారం చేసిన తర్వాత షిరిడీ ఆలయ దర్శనం ఏర్పాటు చేస్తారు. కొన్నిగంటలపాటు అక్కడే గడిపి ఆలయాలను చూస్తారు. సాయంత్రం 6.30గంటలకు నాగర్ సోల్ స్టేషన్ కు చేరుకుంటారు. 7.30గంటలకు తిరుగు ప్రయాణానికి రైలు ఎక్కాల్సి ఉంటుంది.

– నాలుగో రోజు ఉదయం9గంటల సికింద్రాబాద్ చేరడంతో యాత్ర పూర్తి అవుతుంది.

ప్యాకేజీకి సంబంధించిన మరిన్ని వివరాల కోసం https://www.irctctourism.com/ లాగిన్ అవ్వండి. 

ఇది కూడా చదవండి: నిజామాబాద్ జిల్లాలో అర్థరాత్రి ఘోరరోడ్డు ప్రమాదం.!

Latest News

More Articles