Monday, May 6, 2024

బెంగాలీలకు శుభవార్త.. దేవీ నవరాత్రులకు ‘పద్మా పులస’

spot_img

కోల్‌కతా: బంగ్లాదేశ్‌ ప్రభుత్వం బెంగాలీ ప్రజలకు శుభవార్త చెప్పింది. పశ్చిమబెంగాల్‌లో దేవీ నవరాత్రి ఉత్సవాలలో పద్మాపులసల వంటకానికి ప్రత్యేక స్థానం ఉంటుంది. నవరాత్రుల సందర్భంగా ఇళ్లలో హిల్సా(చేప)ను వండుకొని తింటారు. కొంత మంది బెంగాల్‌ ప్రజలు వీటిని పూజల్లో నైవేద్యంగా సమర్పిస్తారు. ఈ నేపథ్యంలో దాదాపు 4వేల మెట్రిక్‌ టన్నుల పద్మాపులసలను భారత్‌లో విక్రయించడానికి బంగ్లాదేశ్‌ ప్రభుత్వం తాజాగా అనుమతులు మంజూరు చేసింది.

Also Read.. ఉద్యమాలకు అడ్డాగా కొండా లక్ష్మణ్ బాపూజీ జల దృశ్యం

దేవీ నవరాత్రుల సందర్భంగా బెంగాలీలకు ఇష్టమైన పద్మాపులసను తీసుకురావడానికి బంగ్లాదేశ్ 40 రోజులు మాత్రమే గడువు ఇచ్చిందని,  ఆ సమయాన్ని మరింత పెంచితే బాగుంటుందని చేపల దిగుమతిదారుల అసోసియేషన్‌ కార్యదర్శి ఒకరు తెలిపారు. కోల్‌కతా మార్కెట్లలో కిలో హిల్సా ధర దాదాపు వెయ్యి రూపాయలు పలుకుతుంది. బంగ్లాదేశ్‌లోని పద్మా నదిలో పుట్టే చేపలు కాబట్టే వీటికి ‘పద్మా పులస’ అనే పేరొచ్చింది.

మరిన్ని వార్తలు:

Latest News

More Articles