Tuesday, May 7, 2024

కేసీఆర్‌ పదేండ్లు సీఎంగా ఉన్నా.. కనీసం ఉండడానికి సొంత ఇల్లు కూడా కట్టుకోలేదు

spot_img

హైదరాబాద్: కేసీఆర్‌ పదేండ్లు సీఎంగా ఉన్నా.. కనీసం ఉండడానికి సొంత ఇల్లు కూడా కట్టుకోలేదని రాష్ట్ర మాజీ ఆర్థికమంత్రి, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు చెప్పారు. ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు 500 గజాల స్థలంలో కట్టుకున్న అదే పడావుబడ్డ ఇంటికి సున్నం వేసుకుని తిరిగి ఆ ఇంటికే వెళ్లి ఉంటున్నారని గుర్తుచేశారు.

Also Read.. గుమ్మినిండా వడ్లు, గూటమోలే పిల్లలుండాలంటే ఎట్ల?. సభలో హరీష్ స్పీచ్ అదుర్స్

బుధవారం అసెంబ్లీలో తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై కాంగ్రెస్‌ ప్రభుత్వం విడుదల చేసిన శ్వేతపత్రంపై జరిగిన చర్చలో ఆయన మాట్లాడుతూ ఈ విషయాన్ని తెలిపారు. ఈ సందర్భంగా గత ప్రభుత్వాన్ని బద్నాం చేసే ప్రయత్నమన్నారు.  కొన్ని విషయాలను విస్మరించి పూర్తిగా తమకు అనుకూలంగా శ్వేతపత్రాన్ని తయారు చేయించుకున్నారని మండిపడ్డారు.

Latest News

More Articles