Tuesday, May 7, 2024

నిరుద్యోగ భృతిపై అప్పుడే మాట మార్చిన కాంగ్రెస్ ప్రభుత్వం

spot_img

హైదరాబాద్ : నిరుద్యోగ భృతిపై అప్పుడే కాంగ్రెస్ ప్రభుత్వం మాట మార్చింది. ‘‘నిరుద్యోగ భృతి ఎప్పుడు ఇస్తారని అడుగుతున్నారు మిత్రుడు.. నిరుద్యోగ భృతి గురించి మేము ఆరు గ్యారెంటీల్లోగానీ.. ఏ హామీల్లోగానీ చెప్పలేదు. మీరు కావాలంటే మళ్లొక్కసారి వెరిఫై చేసుకొని మాట్లాడండి.’’ అంటూ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క బుధవారం అసెంబ్లీ సాక్షిగా అన్న మాటలివి.

Also Read.. కేసీఆర్‌ పదేండ్లు సీఎంగా ఉన్నా.. కనీసం ఉండడానికి సొంత ఇల్లు కూడా కట్టుకోలేదు

కానీ నిరుద్యోగ యువకులకు ప్రతినెలా రూ.4,000 నిరుద్యోగ భృతిగా ఇస్తామని ఆపార్టీ యువనేత ప్రియాంకగాంధీ ఎన్నికలకు ముందు హైదరాబాద్‌ వేదికగా యూత్ డిక్లరేషన్ విడుదల సందర్భంగా ప్రకటించారు. ఆ విషయాన్ని అధికారంలోకి రాగానే కాంగ్రెస్ నేతలు మర్చిపోయారు.

Also Read.. గుమ్మినిండా వడ్లు, గూటమోలే పిల్లలుండాలంటే ఎట్ల?. సభలో హరీష్ స్పీచ్ అదుర్స్

నిరుద్యోగ యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలను కల్పించేవరకు ప్రతి నెల రూ.4 వేల నిరుద్యోగ భృతి చెల్లిస్తామని కాంగ్రెస్‌ హామీ ఇచ్చి.. ఇప్పుడు అధికారంలోకి రాగానే మాట మార్చింది. దీంతో అధికారంలోకి రాగానే కాంగ్రెస్‌ పార్టీ ఒక హామీకి మంగళం పాడిందని ప్రతిపక్ష నేతలు మండిపడుతున్నారు.

Latest News

More Articles