Wednesday, May 1, 2024

ఫాస్ట్ ట్యాగ్ నుంచి క్రెడిట్ కార్డ్ వరకు…ఏప్రిల్ 1ను ఈ మార్పులు జరగబోతున్నాయ్.!

spot_img

మీరు మీ ఫాస్ట్ ట్యాగ్ లో కేవైసీని ఇంకా అప్‌డేట్ చేయకుంటే, ఖచ్చితంగా ఈరోజే పూర్తి చేయండి. దీనికి మార్చి 31 చివరి రోజు. గడువులోగా మీ ఫాస్టాగ్ కేవైసీ అప్‌డేట్ కాకపోతే, మీరు టోల్ ప్లాజా వద్ద సమస్యలు ఎదుర్కొవచ్చు. ఎందుకంటే మీ ఫాస్టాగ్ ఏప్రిల్ 1 నుండి డీయాక్టివేట్ అవుతుంది. ఫాస్టాగ్ కేవైసీ కోసం గడువు అనేక సార్లు పొడిగించింది. ఫాస్టాగ్ డియాక్టివేట్ అయితే మీరు డబుల్ టోల్ పన్ను చెల్లించాల్సి వస్తుంది. ఫాస్టాగ్ కేవైసీని అప్‌డేట్ చేసే ప్రక్రియ ఏమిటో తెలుసుకుందాం.

ఫాస్టాగ్ KYCని అప్‌డేట్ చేసే ప్రక్రియ:

-ముందుగా బ్యాంక్ లింక్డ్ ఫాస్టాగ్ వెబ్‌సైట్‌కి వెళ్లండి.

-మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌ని ఉపయోగించి లాగిన్ చేయండి. OTPని నమోదు చేయండి.

-మై ప్రొఫైల్ విభాగానికి వెళ్లి KYC ట్యాబ్‌పై క్లిక్ చేయండి.

-చిరునామాకు సంబంధించిన పూర్తి వివరాలను సమర్పించండి. ఇప్పుడు మీ కేవైసీ స్టేటస్ కేవైసీ పేజీలో కనిపిస్తుంది.

ఫాస్టాగ్ స్థితిని ఎలా తనిఖీ చేయాలి?

-మీరు fastag.ihmcl.comని వెబ్ సైట్ ద్వారా ఫాస్టాగ్ స్టేటస్ ను చెక్ చేసుకోవచ్చు.

-వెబ్ పేజీ ఓపెన్ చేసినప్పుడు , వెబ్‌సైట్ రైట్ సైడ్ ఎగువ భాగంలో లాగిన్ ట్యాబ్‌పై క్లిక్ చేయాలి.

-లాగిన్ చేయడానికి, మీరు OTP కోసం రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌ను అందించాలి.

-లాగిన్ అయిన తర్వాత, డ్యాష్‌బోర్డ్‌లోని మై ప్రొఫైల్ విభాగంపై క్లిక్ చేయండి.

-FASTag KYC కోసం అవసరమైన పత్రాలు:

-వాహన రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్

– వెహికల్ ఐడీ

-అడ్రస్ ప్రూఫ్

-ఒక పాస్‌పోర్ట్ సైజు ఫోటో

-ఐడీ, అడ్రస్ ప్రూఫ్ కోసం పాస్‌పోర్ట్, ఓటర్ ఐడీ కార్డ్, ఆధార్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్ లేదా పాన్ కార్డ్ ఉపయోగించవచ్చు.

ఇది కూడా చదవండి: రాష్ట్ర వ్యాప్తంగా భానుడి భ‌గ‌భ‌గ‌లు.. ఆ జిల్లాల‌కు ఎల్లో అల‌ర్ట్‌

Latest News

More Articles