Saturday, May 4, 2024

టీమిండియా సెన్షెషన్ బౌలర్..ఎవరీ మయాంక్ యాదవ్..!

spot_img

ఐపీఎల్ ప్రతి ఏడాది దుమ్మురేపే కుర్రాళ్లను బరిలోకి దింపుతుంటుంది. దేశవాళి మ్యాచులో అదుర్స్ అనిపించినా రాని పేరు ఐపీఎల్ ద్వారా యువ క్రికెటర్లు దక్కతుంది. ఆ తర్వాత టాలెంట్ ను గ్రూమ్ చేసుకుంటూ వడివడిగా టీమిండియాలోకి వచ్చేస్తున్నారు. ఈ ఏడాది మరో చాకులాంటి కుర్రాడు క్రికెట్ లవర్స్ ను అట్రాక్ట్ చేస్తున్నాడు. అయితే గతానికి భిన్నంగా ఈ సారి ఓ బౌలర్ ఫ్యాన్స్ ను ఉర్రూతలూగిస్తున్నాడు. గతంలో ఇలా ఓ బౌలర్ ఫ్యాన్స్ను కట్టిపడేయం బుమ్రా డెబ్యూట్ సమయంలో జరిగింది. మధ్యలో ఉమ్రాన్ మాలిక్ వంటివారు అప్పుడప్పుడు మెరుపులు మెరిపించినా వారి కెరీర్ మాత్రం పెద్దగా టర్న్ అవ్వలేదు. తాజాగా పంజాబ్ వర్సెస్ లక్నో మ్యాచులో 21ఏళ్ల మయాంక్ యాదవ్ బంతితో చెడుగుడు ఆడాడటం అందర్నీ ఆకట్టుకుంది. 155.8 వేగంతో బంతిని బౌలింగ్ చేసి ఐపీఎల్ 2024 స్పీడెస్ట్ బౌలింగ్ చేసి రికార్డ్ క్రియేట్ చేశాడు.

లక్నో సూపర్ జెయింట్స్ ఫాస్ట్ బౌలర్ మయాంక్ యాదవ్ ఐపీఎల్‌లో అరంగేట్రం చేసిన మ్యాచ్‌లో అద్భుత ప్రదర్శన చేశాడు. 4 ఓవర్లలో 27 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌గా నిలిచాడు. అరంగేట్రం మ్యాచ్‌లో తుఫాను బౌలింగ్ చేసిన మయాంక్ హెడ్‌లైన్స్‌లో నిలిచాడు. తొలి ఓవర్ లోనే మయాంక్ తన వేగంతో సంచలనం సృష్టించాడు. అతను తన కెరీర్‌లో మొదటి బంతిని 147.1kph వేగంతో బౌల్ చేశాడు. దీని తర్వాత, అతను 4 ఓవర్ల స్పెల్‌లో 150 కిమీ కంటే వేగంగా 9 బంతులు బౌలింగ్ చేశాడు. ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే అతని స్లోయెస్ట్ బాల్ గంటకు 141 కి.మీ.

ఎవరీ మయాంక్?
మయాంక్ యాదవ్ 2002 జూన్ 17న ఢిల్లీలో జన్మించాడు. మయాంక్ ఢిల్లీ తరపున దేశవాళీ క్రికెట్ ఆడాడు. మయాంక్ సోనెట్ క్లబ్ ఆఫ్ ఢిల్లీ నుండి క్రికెట్ శిక్షణ తీసుకున్నాడు. ఇదే అకాడమీ నుంచి భారత వికెట్ కీపర్ రిషబ్ పంత్, శిఖర్ ధావన్, ఆశిష్ నెహ్రా వంటి గొప్ప క్రికెటర్లు పుట్టుకొచ్చారు. అతని దేశీయ కెరీర్ గురించి మాట్లాడుతూ, అతను ఇప్పటివరకు ఒక ఫస్ట్ క్లాస్ మ్యాచ్, 17 లిస్ట్-A, 10 T-20 మ్యాచ్‌లు ఆడాడు. మయాంక్ 17 లిస్ట్ ఏ మ్యాచ్‌ల్లో 34 వికెట్లు పడగొట్టగా, 10 టీ20 మ్యాచ్‌ల్లో 12 వికెట్లు తీశాడు.

IPL 2022 వేలం సందర్భంగా లక్నో సూపర్ జెయింట్స్ మయాంక్ యాదవ్‌ను తమ జట్టులో చేర్చుకుంది. మయాంక్ యాదవ్ బేస్ ధర రూ. 20 లక్షలతో వేలంలోకి ప్రవేశించగా, లక్నో సూపర్ జెయింట్స్ అతడిని బేస్ ధరకే కొనుగోలు చేసింది. దీని తర్వాత అతను గాయం కారణంగా ఐపీఎల్ 2023 నుండి తప్పుకున్నాడు. అతని స్థానంలో అర్పిత్ గులేలియా జట్టులోకి వచ్చాడు. అదే సమయంలో, మయాంక్ ఈ సీజన్‌లో పునరాగమనం చేసాడు. అతని అరంగేట్రం మ్యాచ్‌లోనే స్టార్ అయ్యాడు.

మయాంక్ యాదవ్ ఢిల్లీలోని ఓ సాధారణ కుటుంబం నుంచి వచ్చాడు. లాక్డౌన్ సమయంలో అతని తండ్రి వ్యాపారం దెబ్బతిన్నది. అప్పుడు అతని అకాడమీ అతని కోసం ప్రత్యేక స్పైక్‌లను తయారు చేసింది. ఇప్పుడు మయాంక్ భారత క్రికెట్‌లో కొత్త సంచలనంగా మారాడు.

ఇది కూడా చదవండి: లెక్కలు రాస్తున్నాం.. వడ్డీతో సహా తీర్చుకుంటాం

Latest News

More Articles