Wednesday, May 8, 2024

న్యూ ఇయర్ వేడుకల్లో.. పోలీసుల సరికొత్త ప్రయోగం

spot_img

నూతన సంవత్సరం సందర్భంగా పబ్బుల్లో పని అయిపోయాక అదే మత్తులో రోడ్లపై వాహనాలు నడుపుతూ ఇతరుల ప్రాణాలను ప్రమాదంలో పడేస్తుంటారు. దీంతో న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా రేపు హైదరాబాద్ పోలీసులు సరికొత్త ప్రయోగం చేయనున్నారు. మద్యం తాగి వాహనాలు నడపడమే కాదు, ఎటువంటి డ్రగ్స్ తీసుకున్నా ఇక తప్పించుకోలేరు. డ్రగ్స్ తీసుకునే వారిని పట్టుకునేందుకు ఏం చేస్తున్నామన్న వివరాలను నార్కోటిక్ బ్యూరో ఏసీపీ దీపక్ మీడియాకి వివరించారు.

మత్తుపదార్థాల డిటెక్టర్ టెస్ట్‌ల కోసం నార్కోటిక్ పోలీసులు 100 పరికరాలు కొన్నారు. అబోట్, డ్రాగర్ కంపెనీలకు చెందిన ఈ పరికరాలు మనిషి శరీరంలో డ్రగ్స్‌ను డిటెక్ట్ చేస్తాయి ఈ పరికరాలు. మూడు పద్ధతుల ద్వారా పోలీసులు డ్రగ్స్ టెస్ట్ చేస్తారు. లాలాజలం, యూరిన్ శాంపిల్ ద్వారా డ్రగ్స్ డిటెక్ట్ చేస్తారు. దాని ఫలితాలు రావడానికి కొన్ని రోజులు పడుతుందని అనుకుంటున్నారా? శాంపిల్ తీసుకున్న 6-8 నిమిషాల్లో ఫలితాలు వచ్చేస్తాయి.

ఒక్కో పరికరాన్ని 13 లక్షలు పెట్టి కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. ఒక్కో డివైస్‌కు ప్రత్యేక క్యాట్ రిడ్జ్‌లు ఉంటాయి. ఇంతకు ముందు వరకు గోవా, కేరళలోనే ఈ డ్రగ్ డిటెక్ట్ డివైస్‌లు అందుబాటులో ఉండేవి. రేపు మన దగ్గర కూడా డ్రగ్స్ హాట్ స్పాట్ వద్ద డ్రగ్స్ డ్రైవ్ ఉంటుంది జాగ్రత్త.

Latest News

More Articles