Monday, May 6, 2024

సూర్యుడికి మరింత చేరువగా ఆదిత్య ఎల్-1

spot_img

చంద్రయాన్- 3 తర్వాత భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో అంత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మరో మిషన్ ఆదిత్య. సూర్యుడిపై అధ్యయనం చేసేందుకు ఆదిత్య మిషన్ ను ఇస్రో చేపట్టింది. ఆదిత్య ఎల్-1 ప్రయాణం తుది దశకు చేరుకుందని ఇస్రో ఛైర్మన్ సోమనాథ్ తెలిపారు. జనవరి 7 కల్లా ఆదిత్య వ్యోమనౌక ఎల్-1 పాయింట్ కు చేరుకునేందుకు కావాల్సిన ఏర్పాట్లు పూర్తవుతాయని చెప్పారు. ప్రస్తుతం తుది ఏర్పాట్లను చేస్తున్నామని తెలిపారు.

సెప్టెంబర్ 2న ఆదిత్య ఎల్1ను శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి ప్రయోగించారు. 125 రోజుల్లో 15 లక్షల కిలోమీటర్లు ప్రయాణించిన తర్వాత సూర్యునికి సమీపంలో ఉన్న ఎల్-1 పాయింట్ ను చేరుకునే లక్ష్యంతో దీన్ని ప్రయోగించారు. ఎల్-1 పాయింట్ నుంచి సూర్యుడి ఫొటోలను తీసి భూమికి పంపించనుంది. సూర్యుడిపై లోతుగా అధ్యయనం చేసేందుకు ఇవి ఇస్రోకు ఉపయోగపడనున్నాయి.

ఇది కూడా చదవండి: ఆంధ్రావాళ్లకంటే ఎక్కువగా తెలంగాణ ను ముంచింది కాంగ్రెస్‌ పార్టేనే

Latest News

More Articles