Sunday, May 5, 2024

తెలంగాణ‌లో ‘కంటి వెలుగు’ మరో రికార్డు

spot_img

హైద‌రాబాద్ : రాష్ట్ర ప్ర‌భుత్వం ప్ర‌తిష్టాత్మ‌కంగా చేప‌ట్టిన ‘కంటి వెలుగు’ మరో రికార్డు నమోదు చేసింది. 89 రోజుల పనిదినాలల్లో కోటి 58 లక్షల 35 వేల 947 మందికి కంటి పరీక్షలు(96.21 శాతం) నిర్వ‌హించారు.

దృష్టి లోపం ఉన్న 22 లక్షల 21 వేల 494 మందికి ఉచితంగా కళ్లద్దాలు, మెడిసిన్స్ అందించారు. కోటి 18 లక్షల 26 వేల 614 మందికి ఎలాంటి కంటి సమస్యలు లేవని నిర్ధారణ అయిందని వైద్యారోగ్య శాఖ వెల్లడించింది.

ఈ పథకాన్ని జనవరి 19 నుంచి జూన్ 15 వరకు 100 రోజుల కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. 2018లో నిర్వహించిన మొదటి విడత ‘కంటి వెలుగు’లో  కోటి 50 లక్షల మందికి ఉచితంగా కంటి పరీక్షల నిర్వహించారు.

మొదటివిడతలో 50 లక్షల కళ్లద్దాలను పంపిణీ చేశారు. స్క్రీనింగ్ పూర్తి చేసిన తర్వాత వెంటనే రీడింగ్ గ్లాసెస్, నాలుగు వారాల్లోగా ప్రిస్కిప్షన్ గ్లాసెస్ తప్పకుండా అందేలా చూస్తున్నారు.

Latest News

More Articles