Friday, May 10, 2024

మ‌హ‌బూబ్ న‌గ‌ర్‌లో రెండు లోక్ సభ స్థానాల‌ను గెలుస్తాం

spot_img

ఉమ్మ‌డి మ‌హ‌బూబ్ న‌గ‌ర్ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ బ‌లంగా ఉంద‌ని, ఈ జిల్లాలోని రెండు పార్ల‌మెంట్ స్థానాలు గెలిచే అవ‌కాశాలు ఎక్కువుగా ఉన్నాయ‌ని అన్నారు ఆ పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటిఆర్. ఇవాళ(సోమవారం)హైదరాబాద్ తెలంగాణ భవన్ లో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా నేతలతో సమావేశమైన ఆయ‌న రానున్న ఎన్నికలకు సంభందించిన కార్యాచరణపైన చర్చించారు.

ఎమ్మెల్సీ ఉప ఎన్నిక‌ల‌కు నోటిఫికేషన్ విడుదలైన నేపథ్యంలో ఈ ఎన్నిక పై పట్టాల్సిన కార్యాచరణ పైన స్థానిక నేత‌ల‌తో స‌మాలోచ‌న‌లు జ‌రిపారు. అలాగే . రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో మహబూబ్ నగర్ స్థానంతో పాటు నాగర్ కర్నూల్ లోక్ సభ స్థానంలో అనుసరించాల్సిన వ్యూహాలపైన చర్చించారు. ఒకటి రెండు రోజుల్లోనే ఈ రెండు పార్లమెంట్ నియోజకవర్గాల పైన పార్టీ అధినేత కేసీఆర్ ఒక విస్తృతస్థాయి సన్నాహక సమావేశాన్ని ఏర్పాటు చేయనున్నట్లు కేటీఆర్ తెలిపారు.

దీంతో ఎమ్మెల్సీతో పాటు లోక్ సభ ఎన్నికలకు సంబంధించిన పరిస్ధితులను కేసీఆర్ కి వివ‌రిస్తామ‌ని ఆ జిల్లా నేత‌లు అన్నారు. ప్రస్తుతం ఎమ్మెల్సీ ఎన్నికలతో పాటు ఈ రెండు లోక్ సభ ఎన్నికల్లో పార్టీ విజయ అవకాశాలు బలంగా ఉన్నాయని నేతలు ఆశాభావం వ్యక్తం చేశారు. క్షేత్ర స్థాయిలో బ‌లంగా కృషి చేస్తే మంచి మెజార్టీతో రెండు స్థానాలు పార్టీ గెలుచుకుంటుద‌ని అన్నారు.

ఇది కూడా చదవండి: నేడు హైదరాబాద్ లో ట్రాఫిక్ ఆంక్షలు.. అటు వెళ్తే పద్మవ్యూహంలో చిక్కినట్లే..!

Latest News

More Articles