Thursday, May 2, 2024

దశాబ్ది ఉత్సవాలను ఊరురా పండుగలా నిర్వహించాలి

spot_img

రంగారెడ్డి జిల్లా: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న దశాబ్ది ఉత్సవాలను ఊరురా పండుగలా నిర్వహించాలని తెలంగాణ రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. మీర్ పేట్ లోని SYR గార్డెన్ లో మహేశ్వరం నియోజకవర్గ బిఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి మంత్రి సభితా ఇంద్రారెడ్డి ముఖ్య అతిధిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ నేతృతంలో తెలంగాణ రాష్ట్రం గత 9 సంవత్సరాలగా గణనియమైన అభివృద్ధి సాధించిందని అన్నారు. తెలంగాణలోని ప్రతి ఇంటికి రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు చేరాయని తెలిపారు. దేశంలోనే రైతులకు 24 గంటల ఉచిత కరెంట్, రైతు బందు, రైతు భీమా  ఇస్తున్న ఏకైక రాష్టం తెలంగాణ రాష్ట్రమని అన్నారు.

దశాబ్ది ఉత్సావల్లో ప్రజలు పెద్ద సంఖ్యలో భాగస్వామ్యం కావాలని  మంత్రి సభితా ఇంద్రారెడ్డి పిలుపునిచ్చారు. కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర గ్రంధాలయం సంస్థ  చైర్మన్ శ్రీధర్, రంగారెడ్డి జిల్లా జడ్పీ చైర్మన్ అనిత హరినాధ్ రెడ్డి, BRS పార్టీ ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Latest News

More Articles