Sunday, May 5, 2024

చరిత్ర సృష్టిస్తే.. ఎన్టీఆర్ నే ఎగతాళి చేస్తారా.. మంచు లక్ష్మి సీరియస్..!

spot_img

వెరైటీ మ్యాగజైన్ బెస్ట్ యాక్టర్ ఆస్కార్ ప్రిడిక్షన్స్ లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ టాప్ 10 ప్లేస్ లో ఉన్నాడనే వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సామాన్యులు, మీడియా సంస్థలు ఎన్టీఆర్ ని పొగుడుతున్నా.. ఫిల్మ్ సెలబ్రిటీలు పెద్దగా స్పందించటం లేదు. కొంతమంది సెలబ్రిటీలు మాత్రమే ఎన్టీఆర్‌ని అభినందిస్తూ ట్వీట్లు చేసినా.. బడా స్టార్లు ఎవరూ నోరు మెదపటం లేదు. దీంతో మంచు లక్ష్మి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎన్టీఆర్ సాధించిన ఘనత చిన్న విషయం కాదు. ప్రపంచ సినిమా చరిత్రలోనే పెద్ద విజయం. మనం ఎందుకు జరుపుకోకూడదు? అందరూ ఎందుకు మౌనంగా ఉన్నారు అంటూ మంచు లక్ష్మి ఇండస్ట్రీ పెద్దలపై హాట్ కామెంట్స్ చేసింది. విల్‌ స్మిత్‌, హ్యూ జాక్మన్‌ వంటి ప్రముఖ హాలీవుడ్ స్టార్స్ తో ఎన్టీఆర్ పోటీ పడటం అంటే మామూలు విషయం కాదు.

ఇక ఈ విషయాన్ని సెలబ్రిటీలు, మీడియా పట్టించు కోకపోవడంపై ముంచు లక్ష్మి మండి పడింది. ఈ ఘనత ఒక్క ఏన్టీఆర్‌ మాత్రమే సాధించారు. ఓ ఇంటర్నేషనల్ మ్యాగజీన్‌లో ఇండియాకో స్థానం సంపాదించి పెట్టారు అని పేర్కొంది మంచు లక్ష్మి. నిజానికి ఒక్క స్టార్ హీరో, హీరోయిన్ కూడా ఎన్టీఆర్‌ని అభినందిస్తూ ట్వీట్ చేయలేదు. కానీ ఫ్యాన్స్ మాత్రం బీభత్సం సృష్టిస్తున్నారు. ఎన్టీఆర్ ఒక్కసారి ఆస్కార్ నామినేషన్ కి వెళ్లినా.. ఆస్కార్ తీసుకోకుండా ఇండియాకి వచ్చినా.. ఆ వేడుకలు ఎలా ఉంటాయో చూపిస్తాం అంటున్నారు ఫ్యాన్స్. అయితే కొంత మందికి మాత్రం ఆస్కార్ అంచనాల్లో టాప్ 10 స్థానాల్లో ఎన్టీఆర్ ఉండటం మింగుడు పడటం లేదు. ఎన్టీఆర్ ఆ లిస్టులో ఎలా ఉన్నాడు? అది అక్షర దోషమా? అసలు తారక్ 19వ స్థానంలో ఉన్నాడు అంటూ ఎగతాళి చేస్తున్నారు.

Latest News

More Articles