Tuesday, May 7, 2024

చిరంజీవితో సినిమా ప్రకటించిన ‘మెగా’ డాటర్

spot_img

హైదరాబాద్: మెగాస్టార్‌ చిరంజీవి 68వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయన పెద్ద కూతురు సుస్మిత కొణిదెలకు చెందిన  ‘గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్మెంట్’ #మెగా156 సినిమా అనౌన్స్ వచ్చింది.  సుష్మిత నిర్మాతగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు.

భోళా శంకర్ మూవీ నిరాశ పర్చిన మెగాస్టార్ చిరంజీవి రీమేక్ చిత్రాలను పక్కన పెట్టినట్టు తెలుస్తోంది. తాజాగా చిరు పుట్టిన రోజు సందర్భంగా రెండు కొత్త ప్రాజెక్టులను ప్రకటించారు. ఇందులో ఒక మూవీని చిరు తన కూతురు సుస్మిత బ్యానర్ లో చేస్తుండగా, మరోకటి ‘భింబిసార’ దర్శకుడు తెరకెక్కించబోయే యూనివర్సల్ చిత్రం. త్వరలో ఈ రెండు చిత్రాలకు సంబంధించిన వివరాలను వెల్లడించనున్నట్లు మేకర్స్ వెల్లడించారు.

Latest News

More Articles