Saturday, May 11, 2024

ధాన్యం సేకరణపై కాంగ్రెస్, బీజేపీ నాయకులకు కనీస అవగాహన లేదు

spot_img

కరీంనగర్ జిల్లా: అకాల వర్షాలతో రైతులు మరింత నష్టపోకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామని మంత్రి గంగుల కమలాకర్  అన్నారు. ఎఫ్.సి.ఐ నిబంధనల ప్రకారం 17 తేమ శాతం కోసం ఎదురు చూస్తే రైతులు మరింత నష్టపోయే ప్రమాదముందని, 20 శాతం తేమ ఉన్న ధాన్యాన్ని కూడా కొనుగోలు చేసేలా రైస్ మిల్లు యజమానులను ఒప్పించామని తెలిపారు.

ఈ రోజు వర్షం తెరిపి ఇవ్వడంతో పెద్దఎత్తున కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యాన్ని కొనుగోలు చేసి రైస్ మిల్లులకు తరలించినట్లు పేర్కొన్నారు.  ధాన్యం సేకరణ విషయంలో కాంగ్రెస్, బీజేపీ నాయకులకు కనీస అవగాహన లేదన్నారు.   అకాల వర్షాలతో నష్టపోయిన రైతులను ఆదుకునే విషయంలో.. నిబంధనల సడలింపు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం చేసిన సూచనలను కేంద్రం, ఎఫ్.సి.ఐ పట్టించుకోవడం లేదని మంత్రి గంగుల కమలాకర్ మండిపడ్డారు.

Latest News

More Articles