Wednesday, May 8, 2024

ఎస్సీ వర్గీకరణపై కేంద్రం తాత్సారం.. మోడీని నిలదీయాలి.. హరీష్ రావు పిలుపు

spot_img

హైదరాబాద్: ఎస్సీ వర్గీకరణ కోసం రెండు సార్లు కేంద్రానికి తీర్మానం చేసి పంపించామని, కేంద్రంలో ఉన్న మోడీ ప్రభుత్వం తొమ్మిదిన్నర ఏళ్లలో ఎస్సీ వర్గీకరణ పై తాత్సారం చేస్తోందని మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. ఎన్నికల సందర్భంగా తెలంగాణకు వస్తున్న మోడీ దీనిపై సమాధానం చెప్పి రావాలని ఆయన డిమాండ్ చేశారు. ఇందిరా పార్కులో వంగపల్లి శ్రీనివాస్ అద్వర్యంలో మాదిగల యుధ్ధ భేరి సభకు మంత్రి హరీష్ రావు హాజరై మాట్లాడారు.

Also Read.. తెలంగాణీయులమే.. విద్వేషపూరిత వ్యాఖ్యలపై ‘గ్రేటర్ రాయలసీమ’ క్లారిటీ

మాదిగల పై మోడీకి చిత్తశుద్ది లేదు. కేసీఆర్ ఎన్నో సార్లు అడిగినా మోడీ పట్టించుకోవడం లేదు. తీర్మానం ప్రతిని ఎమ్మెల్యే రాజయ్య, కడియం శ్రీహరి చేత మోడీకి ఇచ్చాము. కానీ మోడీ పట్టించుకోలేదు. వచ్చే ఎన్నికల తర్వాత జాతీయ స్థాయిలో మన పార్టీ కీలక పాత్ర పోషిస్తుంది. అప్పుడు ఎస్సీ వర్గీకరణ సాధించి తీరుతామని తెలిపారు.

Also Read.. ఖమ్మం ప్రజలను గుత్త పట్టినారా? పొంగులేటి, తుమ్మలపై సీఎం కేసీఆర్ ఫైర్

తెలంగాణ రాగానే కొంతమంది పదవులు వదిలేసి మిమ్మల్ని పట్టించుకోకుండా వెళ్ళారు. కానీ కేసిఆర్ అలాగ కాదు. 33 దళిత స్టడీ సర్కిల్స్ ఏర్పాటు చేసింది ప్రభుత్వం. దళిత బంధు ద్వారా 10 లక్షలు ఇవ్వటం, అది కూడా అర్హులకు ఇవ్వాలనే ఉద్దేశ్యంతో ఈ కార్యక్రమం చేపట్టామని హరీష్ రావు వివరించారు.

Latest News

More Articles