Monday, May 6, 2024

ఎన్నికలంటే ఐదు రోజుల పండగ కాదు.. ఐదు ఏండ్ల భవిష్యత్తు

spot_img

ఎన్నికలంటే ఐదు రోజుల పండగ కాదు.. ఐదు ఏండ్ల భవిష్యత్తు అని అన్నారు మంత్రి హరీశ్ రావు. కేసీఆర్ వచ్చిన తర్వాత చెరువులు కుంటలు బాగు చేసుకుని.. రెండు పంటలు పండుతున్నాయా లేదా అనే విషయాన్ని రైతులు ఆలోచించాలన్నారు. కామారెడ్డి జిల్లా లింగంపేట్ మండల కేంద్రంలో రోడ్ షో లో పాల్గోని మాట్లాడారు మంత్రి హరీశ్  రావు. గతంలో కరెంటు కోసం ఎదురుచూసే పరిస్థితి ఉండేది.కటికేస్తే వచ్చే కరెంటు కావాలా.. కాంగ్రెస్ హయాంలో దొంగలా వచ్చే కరెంట్ కావాల్నా రైతులు ఆలోచించాలి. కర్ణాటకలో రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ మాటలను నమ్మి అక్కడి ప్రజలు ఓటు వేస్తే నట్టేట ముంచారు. కేసీఆర్ గెలిస్తే ఎకరానికి 15 వేల రూపాయలు ప్రతి పంటకు ఇస్తామన్నారు.

ఇది కూడా చదవండి: గోదావ‌రిపై క‌ర‌క‌ట్ట క‌ట్టి మంచిర్యాల‌కు వ‌ర‌ద‌ నీరు రాకుండా చేసే బాధ్య‌త నాది

అంతేకాదు..కార్యకర్తలు సౌభాగ్య లక్ష్మి, కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్, పంట పెట్టుబడి సాయం గ్యాస్ సిలిండర్ల ధర తగ్గింపు వివరాలను ప్రజలకు వివరించాలన్నారు మంత్రి హరీశ్ రావు. కాంగ్రెస్ పార్టీ గతంలో తండాలను గ్రామపంచాయతీలుగా మారుస్తామని చెప్పి ఎగబెట్టింది. విద్యా, వైద్య రంగాలలో ఎస్టీలకు రిజర్వేషన్ కల్పించాం.

ఇక్కడ అభ్యర్థి.. అమెరికా నుంచి పైసలు తీసుకొచ్చి నాయకులను కొంటున్నాడని తెలిపారు మంత్రి హరీశ్ రావు. ఎల్లారెడ్డి ఆత్మగౌరవం గెలిపించే విధంగా సురేందర్ కు ఓటు వేయాలన్నారు. చరిత్రను తిరగ రాసిండు కేసీఆర్ ఆ విషయాన్ని ప్రజలు గ్రహించాలన్నారు.

ఇది కూడా చదవండి: బండి సంజయ్ దుర్మార్గుడు, అత్యంత అవినీతిపరుడు

Latest News

More Articles